CM Revanth Reddy: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న వాళ్లకు బిగ్ షాక్.. కూల్చివేతలపై మరో బాంబు పేల్చిన సీఎం రేవంత్..

Revanth Reddy at police parade: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోలీస్ అకాడమిలో ఎస్సైల పాసింగ్ అవుట్ పరేట్ లో పాల్గొన్నారు. మరోసారి చెరువుల స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై మండిపడ్డారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 11, 2024, 02:56 PM IST
  • పోలీస్ పాసింగ్ అవుట్ పరెడ్ లో పాల్గొన్న రేవంత్..
  • అక్రమ కట్టడాలపై మరోసారి ఫైర్..
CM Revanth Reddy: కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్న వాళ్లకు బిగ్ షాక్.. కూల్చివేతలపై మరో బాంబు పేల్చిన సీఎం రేవంత్..

CM Revanth Reddy in Hyderabad police passing out parade: తెలంగాణ ముఖ్యమంత్రి మరోసారి అక్రమ నిర్మాణ దారులపై మండిపడ్డారు. ఇటీవల హైడ్రా.. తెలంగాణలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరబాద్ లో బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని పలు అక్రమ నిర్మాణాల్ని హైడ్రా కూల్చివేస్తుంది. దీంతో అక్రమ నిర్మాణ దారులకు వీకెంట్ వచ్చిందంటే.. కంటి మీద కునుకు కరువైందని చెప్పుకొవచ్చు. మరోవైపు సీఎం రేవంత్ హైడ్రా కాన్పెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇటీవల హైడ్రా కు ప్రత్యేకంగా సీఐలు, ఎస్సైలను కేటాయిస్తు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా హజరయ్యారు.  ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. యువత ప్రాణత్యాగాలతో, ఆత్మబలిదానాలతో తెలంగాణ సాధించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ వచ్చినా గత తొమ్మిదేళ్లలో  నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రజల మద్దతుతో...తెలంగాణలో రాష్ట్రంలో  ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామని కూడా గుర్తుచేశారు. ఇటీవల.. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుమన్నారు. నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. వ్యసనాలకు బానిసలైన కొంతమంది... డ్రగ్స్, గంజాయి, సైబర్  నేరాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి ఘటనపై ఉక్కు పాదం మోపాలన్నారు. మీ అందరిని చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతోంది.

ఇది ఉద్యోగ బాధ్యత కాదు.. ఇది భావోద్వేగమి అన్నారు. తెలంగాణను పునర్నిర్మించి, భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం రేవంత్ అన్నారు. సమాజంలో.. ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే అని పేర్కొన్నారు.
50 ఎకరాల్లో హైదరాబాద్ లో  పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. 50 ఎకరాల్లో వరంగల్ లో... మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు.

రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కావాల్సింది.. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అని రేవంత్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే నేరస్తులకు కాదని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడమే కాదు.. రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోంది. కేవలం 28 రోజుల్లోనే 22 లక్షల 22 వేల 685 రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు వేసి రుణమాఫీ చేసాం.

హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి. దీని వల్ల..
 పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయన్నారు. అందుకే చేరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నట్లు తెలిపారు.

అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకూ వెనకాడమంటూ రేవంత్ స్పష్టం చేశారు. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్చందంగా వదలాలని ఆక్రమనదారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామని అన్నారు. 

Read  more: Hydra: సీఎం రేవంత్ మరో సంచలనం.. ఇకపై హైడ్రా NOC ఇస్తేనే భవన నిర్మాణాలు ..?..డిటెయిల్స్ ఇవే..

మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తామని తెలిపారు. ఎఫ్టీఎల్, బఫర్  జోన్ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదన్నారు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న వారిని సైతం వదిలేదని లేదని, కోర్టులలోనే వారిపైన కోట్లాడుతామని కూడా సీఎం రేవంత్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News