CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం

Womens Organization Assistant Salary Hike: మహిళా సంఘాల సహాయకులకు సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్ ఇచ్చారు. వారి జీతాలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో 17,608 మంది వీవోఏలకు లబ్ధి చేకూరనుంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 31, 2023, 08:12 PM IST
CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం

Womens Organization Assistant Salary Hike: రక్షా బంధన్ కానుకగా రాష్ట్రంలోని  మహిళా సంఘాల సహాయకుల (వీవోఏ)లకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. వారి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో నెలకు రూ.8 వేల వరకు జీతాలు పెరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకులకు లబ్ధి చేకూరనుంది. జీతాల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. కాగా.. పెంచిన వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో ఏడాదికి రూ.106 కోట్లు ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది. 

జీతాలు పెంచాలని.. తమ యూనిఫాం కోసం నిధులను అందించాలని.. ప్రతి మూడునెల్లకోసారి అమలవుతున్న రెన్యువల్ విధానాన్ని సవరిస్తూ దాన్ని ఏడాదికి పెంచాలని ఐకేపీ మహిళా సంఘాల విజ్జప్తులకు కూడా సీఎం కేసీఆర్ అంగీకరించారు. అదేవిధంగా లైఫ్ ఇన్సురెన్స్‌ డిమాండ్‌కు కూడా సానుకూలంగా స్పందించారు. యూనిఫాం డ్రెస్ విధానం ఏడాదికి రూ.2 కోట్లు నిధులను ప్రభుత్వం కేటాయించనుంది.  అదేవిధంగా ప్రతి మూడు నెలకు ఒకసారి రెన్యువల్ విధానానికి చెక్ పడనుంది. ఇక నుంచి ఏడాదికి ఒకసారి రెన్యువల్ చేయనున్నారు. 

జీవిత బీమాకు సంబంధించి విధివిధానాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై వీవోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమను గతంలో  ఏ ప్రభుత్వమూ  పట్టించుకోలేదని.. సీఎం కేసీఆర్ తీసుకున్న మానవీయ నిర్ణయంతోనే నేడు నెల జీతాలతో భరోసా దొరికిందని అన్నారు. తమకు ఆసరానందిస్తూ భరోసాగా నిలిచినందుకు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు.  

ఉమ్మడి రాష్ట్రంలో పొదుపు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు సహాయకులుగా పనిచేస్తూ.. సంఘానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాల సమాచారాన్ని నోట్ బుక్కుల్లో నమోదు చేసే విధులను స్వచ్ఛందంగా వీవోఏలు నిర్వహించేవారు. వీరికి మహిళా సంఘాల నుంచి నెలకు రూ.2 వేల వేతనం మాత్రమే వచ్చేది. తెలంగాణ ఏర్పడిన తరువాత వీరికి నెలకు రూ.3 వేలను గౌరవవేతనంగా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 2016 నుంచి నెలకు రూ.3 వేలు అందుతోంది. ఇటీవలే పెంచిన పీఆర్‌సీని వీరికి కూడా వర్తింపజేయడంతో వేతనం రూ.3900కు చేరింది. దీంతో మహిళా సంఘాల నుంచి అందే రూ.2 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే రూ.3,900 మొత్తం కలిపితే.. వేతనం 5900 రూపాయలుగా ఉంది. తాజాగా వారి విజ్జప్తి మేరకు రాఖీ పండుగ కానుకగా జీతాలు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Raksha Bandhan Wishes 2023: రాఖీ శుభాకాంక్షలు ఇలా ప్రత్యేక ఫోటోస్, కోట్స్‌తో తెలియజేయండి..   

Also Read: Aditya-L1 Mission Rehearsals: ఆదిత్య L1 ప్రయోగం రాకెట్ చెకింగ్, రిహార్సల్స్ పూర్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News