KCR's First Signatures: కొత్త సచివాలయంలో కేసీఆర్ చేసిన తొలి సంతకాలు వీటిపైనే

KCR's First Signatures in Telangana New Secretariat: హైదరాబాద్: కొత్తగా ప్రారంభోత్సవం జరుపుకున్న నూతన సచివాలయంలోని తన ఛాంబర్ లో విధులు చేపట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2023, 05:06 AM IST
KCR's First Signatures: కొత్త సచివాలయంలో కేసీఆర్ చేసిన తొలి సంతకాలు వీటిపైనే

KCR's First Signatures in Telangana New Secretariat: హైదరాబాద్: కొత్తగా ప్రారంభోత్సవం జరుపుకున్న నూతన సచివాలయంలోని తన ఛాంబర్ లో విధులు చేపట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. 2023-24 సంవత్సరంలో దళిత బంధు పథకం అమలుకు సంబంధించిన ఫైలు మీద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజక వర్గానికి 1100 మంది లబ్ధిదారుల చొప్పున దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తూ సిఎం కేసీఆర్ ఆ ఫైలుపై తొలి సంతకం చేశారు. 

అలాగే ఎన్నో ఏళ్లుగా నానుతున్న గిరిజనుల పోడుభూముల పట్టాల పంపిణీకి సంబంధించిన ఫైలు మీద కూడా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండో సంతకాన్ని చేశారు. ఈ మే నెల నుంచి జిల్లాలవారిగా పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్టు ఈ ఫైలుపై సంతకం చేయడం ద్వారా సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. తద్వారా 1 లక్షా 35 వేల మంది లబ్ధిదారులకు దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు భూములకు పట్టాలు అందచేయనున్నారు. పోడు భూములకు సంబంధించిన ఫైలులో ఈ వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు. 

సిఎంఆర్ఎఫ్ నిధులు లబ్ధిదారులకు సంబంధించిన ఫైలు మీద సిఎం కేసీఆర్ సంతకం చేశారు.
4.    గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అందించే...కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కు సంబంధించిన ఫైలు మీద సిఎం కేసీఆర్ సంతకంచేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ జరుగనున్నది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా  13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలని లక్ష్యం గా ఎంచుకున్న నేపథ్యంలో..6.84 లక్షల మంది గర్భిణులు లబ్ధి పొందనున్నారు. కాగా ఒక్కో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ విలువ రెండు వేల రూపాయలు. ఇందుకు గాను ప్రభుత్వం మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనున్నది.
5.     రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఫైలుమీద సిఎం కేసీఆర్ సంతకం చేశారు.
6.    పాలమూరు లిఫ్టు ఇరిగేషన్ కు సంబంధించిన ఫైలు మీద సిఎం కేసీఆర్ సంతకం చేశారు.

 

Trending News