CM KCR's Dalit CM remarks: దళితుడిని సీఎం చేయకపోయినా మళ్లీ గెలిచాం కదా: సీఎం కేసీఆర్

CM KCR comments about Dalit CM promise: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట తప్పారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే విపక్షాలు చేస్తున్న ఈ విమర్శలపై సీఎం కేసీఆర్ సోమవారం నాటి ప్రెస్‌మీట్‌లో సమాధానం ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 05:19 AM IST
CM KCR's Dalit CM remarks: దళితుడిని సీఎం చేయకపోయినా మళ్లీ గెలిచాం కదా: సీఎం కేసీఆర్

CM KCR comments about Dalit CM promise: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట తప్పారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే విపక్షాలు చేస్తున్న ఈ విమర్శలపై సీఎం కేసీఆర్ సోమవారం నాటి ప్రెస్‌మీట్‌లో సమాధానం ఇచ్చారు. ఎక్స్‌‌పైరీ అయిన మెడిసిన్​ లెక్క ' దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నవ్, ఎందుకు చేయలేదు' అంటూ ప్రతీసారి అడిగిందే అడుగుతున్నారు అంటూ విపక్షాలపై సీఎం కేసీఆర్ (Telangana CM KCR) మండిపడ్డారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR comments about Dalit CM) మాట్లాడుతూ.. ''దళితున్ని సీఎం చేస్తనని చెప్పిన. కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు అనడానికి దాని కారణాలు దానికున్నయ్. అనేక కారణాంతరాల వల్ల ఆ పని చేయలేదు'' అని అంగీకరించారు. ఈ విషయంలో సమాధానం నేను చెప్పుడు అని కాదుగానీ.. ''మేమే చేయనీలేదు కేసీఆర్‌‌ను'' అంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీనే (Shabbir Ali about Dalit CM) స్వయంగ చెప్పిండు కదా'' అని బంతిని కాంగ్రెస్ కోర్టులో వేశారు. 

దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదనే మా నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించకపోతే.. మళ్లీ రెండోసారి కూడా మేమే ఎందుకు గెలిచాం అని సీఎం కేసీఆర్ (CM KCR) ఎదురు ప్రశ్నించారు. మొదటిసారి 63 ఎమ్మెల్యే స్థానాలు గెలిస్తే తర్వాతిసారి 88 సీట్లు గెలిచినం. దాని తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో మీ అడ్రస్సే లేదు కదా అని విపక్షాలపై విరుచుకుపడ్డారు.

Trending News