Telangana ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు.. వేతనాల పెంపు, మరెన్నో నిర్ణయాలు

Salary Hike For Govt Employees In Telangana: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CMKCR) నిర్ణయించారు.

Last Updated : Dec 29, 2020, 10:22 PM IST
  • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు
  • కొత్త సంవత్సరం కానుకగా వేతనాల పెంపు, పదవీ విరమణ వయసు పెంపు
  • ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లపై కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు.. వేతనాల పెంపు, మరెన్నో నిర్ణయాలు

Salary Hike For Govt Employees In Telangana: నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CMKCR) నిర్ణయించారు.

 

ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని Telangana సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

అన్నిరకాల ఉద్యోగులు కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపు వల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్(KCR) ప్రకటించారు.  

Also Read: LRS In Telangana: ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై సర్కార్ కీలక నిర్ణయం

ఉద్యోగ విరమణ వయసు
వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయసు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. 

Also Read: New CoronaVirus Strain: కొత్త వైరస్‌ భయంకరమైనది కాదు: మంత్రి ఈటల రాజేందర్

ఉద్యోగాల భర్తీ
అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల(Jobs) ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. 

‘ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలనే విషయంలో అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చిస్తుంది. అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

Also Read: Tollywood నటుడు వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్.. షాకింగ్ ట్వీట్

‘ప్రతి ఉద్యోగి తాను ఉద్యోగంలో చేరిన నాడే తాను ఏ సమయానికి పదోన్నతి పొందుతాడో, రిటైర్ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళతాడో స్పష్టత ఉండాలి. దీనికి అనుగుణంగా చాలా సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసు రూల్స్ రూపొందించాలి. పదోన్నతుల కోసం ఎవరివద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. సమయానికి ఉద్యోగికి రావల్సిన ప్రమోషన్ ఆర్డర్ వచ్చి తీరాలి. ఉద్యోగులకు తమ కెరీర్ విషయంలో అంతా స్పష్టత ఉండే విధంగా సర్వీస్ రూల్స్ ఉండాలి’ అని సీఎం కేసీఆర్ సూచించారు. 

కారుణ్య నియామకాలు
‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరగడం అత్యంత విషాదకరం. దు:ఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం పడొద్దు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలి’’ అని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Also Read: Job Tips: మీరు ఇలా చేస్తున్నారా.. అయితే జాబ్ మారాల్సిందే! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News