Rajbhavan: రాజ్ భవన్ లో చిరంజీవి.. బీజేపీ ఆఫీసులో గద్దర్! తెలంగాణలో సంచలనం...

Chiranjeevi, Gadder: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి.తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు ప్రజా గాయకుడు గద్దర్.

Written by - Srisailam | Last Updated : Sep 4, 2022, 12:05 PM IST
  • రాజ్ భవన్ లో చిరంజీవి
  • బీజేపీకి ఆఫీసుకు గద్దర్
  • తెలంగాణలో సంచలనం
Rajbhavan: రాజ్ భవన్ లో చిరంజీవి.. బీజేపీ ఆఫీసులో గద్దర్! తెలంగాణలో సంచలనం...

Chiranjeevi, Gadder: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. గత నెలలో తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. ఆ మీటింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. తర్వాత తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను హీరో నితిన్ కలిశారు. ఈ రెండు ఘటనలతో టాలీవుడ్ స్టార్లపై బీజేపీ ఫోకస్ చేసిందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రావాల్సి ఉన్న బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్మ్త ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేసి షాకిచ్చింది కేసీఆర్ సర్కార్. రాజకీయ కారణాలతోనే పోలీసులు పర్మిషన్ క్యాన్సిల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి,. అమిత్ షాను కలిసినందుకే జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనాల్సిన షోకు బ్రేకులు పడ్డాయనే టాక్ వస్తోంది.

బ్రహ్మాస్త్ర ఈవెంట్ రద్దుపై రచ్చ సాగుతుండగానే మరో రెండు కీలక పరిణామాలు జరిగాయి. అందరిని షాకింగ్ కు గురి చేస్తూ తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు ప్రజా గాయకుడు గద్దర్. విప్లవ నేతగా గుర్తింపు ఉన్న గద్దర్.. కాషాయ పార్టీ కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు గద్దర్. అల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ  ఆర్గనైజేషన్ నాయకులు కూడా గద్దర్ తో పాటు ఉన్నారు. దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని విన్నవించారు. బాబా సాహెబ్ పేరు అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని సంజయ్ ని కోరారు గద్దర్.  ఈ సందర్భంగా బండి సంజయ్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు గద్దర్. కొత్త లుక్ లో బాగున్నారంటూ గద్దర్ ను ప్రశంసించారు సంజయ్. ఇద్దరు నేతలు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి రాజ్ భవన్ వెళ్లారు.  చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన రక్తదాతలకు చిరంజీవి చేతుల మీదుగా ‘చిరు భద్రతా కార్డు’లను గవర్నర్ తమిళిసై అందించారు. బ్లడ్ డోనర్స్ ను సత్కరించి లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించారు. రక్తదానం చేస్తున్న ప్రతీ అభిమానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ  ప్రారంభించినప్పుడు, సినీ కార్మికులకు నిత్సావసరాలు అందించినప్పుడు గవర్నర్ తనను ఎంతగానో ప్రోత్సహించారని చిరంజీవి చెప్పారు.

కొన్ని రోజులుగా తెలంగాణ సర్కార్, గవర్నర్ తమిళి సై మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి.. రాజ్ భవన్ కు వెళ్లడం ఆసక్తి రేపుతోంది. రక్తదాన కార్యక్రమం కోసమే మెగాస్టార్ రాజ్ భవన్ కు వెళ్లినా.. రాజకీయంగా ఇది చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను ఆకర్షించే ప్రయత్నంలో బీజేపీ ఉండటంతో.. చిరంజీవి రాజ్ భవన్ పర్యటనపైనా పలు రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.   

Read Also: MLA Gadari Kishore:నా  సభకు వస్తేనే పెన్షన్‌‌ ఇవ్వు.. లేదంటే లాగు పగుల్తది! గ్రామ కార్యదర్శికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్  

Read Also: Chennupati Gandhi: ఇనుపచువ్వతో టీడీపీ నేత కన్ను పొడిచేశారు.. విజయవాడలో వైసీపీ నేతల కిరాతకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News