బగావో కేసీఆర్.. జితావో బీజేపీ.. నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

ఎన్నికల సమరంలో అన్ని పార్టీలు యాక్టివ్ గా ప్రచారాలన్ని కొనసాగిస్తున్నాయి. అటు బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇటు అధికార బిఆర్ఎస్ పార్టీలు ఏ మాత్రం తగ్గకుండా ప్రజలను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాయి. దుబ్బాకలో జరిగిన నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..    

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2023, 06:06 PM IST
బగావో కేసీఆర్.. జితావో బీజేపీ.. నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

Telangana Assembly Election 2023: తెలంగాణలో ఎన్నికల తేదీ ప్రకటన  రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మొదలెట్టసాయ్. అటు అధికార పార్టీ బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ కూడా తన ప్రచారాన్ని ప్రారంభించేసింది. జాతీయ రాజాకీయ పార్టీలు అయినట్టి కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఢిల్లీ నేతలు ఎన్నికల ప్రచారానికి తెలంగాణలో పర్యటిస్తున్నారు. అటు రాహుల్ గాంధీ.. ఇటు బీజేపీ నేతలు చాలా ఉషారుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 

దుబ్బాకలో బీజేపీ నిర్వహించిన నారీశక్తి వందన కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. బగావో కేసీఆర్.. జితావో బీజేపీ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. 
అవినీతి అనే పదానికి కవల పిల్లలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ కి ఓటేసినట్టే. కేసీఆర్, రాహుల్ గాంధీ మన ముందు తెలంగాణ గల్లీల్లో కొట్లాడుతారు కానీ ఢిల్లీలో కలిసి అలయ్.. బలయ్ తీసుకొని చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. 

సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీది. దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా సీఎం కేసీఆరే ఒప్పుకున్న సంగతి మనకు తెల్సిందే! 
నీళ్లు, నిధులు, నియామకం కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి అడ్డగోలుగా వ్యయం పెంచారు. అయినా కూడా 60 శాతం భూములకు నీళ్లు అందడం లేదు. ఈ పదేళ్ళలో 5 లక్షల కోట్ల అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం. నియామకాల విషయంలో తెలంగాణ యివతకి అన్యాయం చేసి తన కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయి.

Also Read: AP CM YS Jagan: ఒప్పంద ఉద్యోగులకు దసరా కానుక, రెగ్యులరైజ్ చేస్తూ ఆదేశాలు

సీఎం కేసీఆర్ చెప్పిందోకటి… చేసేదొక్కటి. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ పేదలకు ఇవ్వలేదు. ప్రధాని మోడీ అవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్ళు కట్టించారు. కానీ అది బిఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. TSPSC పేపర్ లీకులతో యువత జీవితాలని చీకటిలో పడేశారు. 

సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ పట్టణాలను స్మార్ట్ సిటీలుగా చేయడానికి మోడీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు సమకూర్చారు. . రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాల్లో కేసీఆర్ హస్తం ఉంది. ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. మోసం చేసే కేసీఆర్ వైపా.. అభివృద్ధి చేసే మోదీజీ వైపా..?  రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ఓపెన్ చేసి ఎరువుల కొరతను తీర్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. 
ప్రజలను మోసం చేసిన కేసీఆర్ సర్కారును బుద్ధి చెప్పి.. అభివృద్ధిని తీసుకొచ్చే బిజెపిని గెలిపించాలని కోరుతున్నా.. అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. 

Also Read: Bhagavanth Kesari : హాఫ్ సెంచరీ కొట్టేసిన బాలకృష్ణ.. దసరా విన్నర్ షురు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

Trending News