Kavitha: ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత... బిడ్డను చూసి భావోద్వేగానికి గురైన కేసీఆర్.. వీడియో ఇదే..

Ex cm kcr emotional: కల్వకుంట్ల కవిత ఎర్రవెల్లిలోని తన తండ్రి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తన బిడ్డను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 29, 2024, 02:41 PM IST
  • ఎర్రవెల్లికి వెళ్లిన కవిత..
  • తండ్రిని చూసి ఎమోషనల్..
Kavitha: ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత... బిడ్డను చూసి భావోద్వేగానికి గురైన కేసీఆర్.. వీడియో ఇదే..

kavitha meets her father kcr emotional video viral: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాదాపు ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. ఆమె బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. పలు మార్లు ఆమె బెయిల్ రిక్వెస్ట్ ను సీబీఐ , హైకోర్టులు తిరస్కరించాయి. దీంతో కవిత తరపు లాయర్ లు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కోసం పిటిషన్ ను దాఖలు చేశారు.ఈ క్రమంలో పిటిషన్ ను విచారించిన అత్యున్నత ధర్మాసనం కవితకు.. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అంతకు ముందు కవిత బెయిల్ పిటిషన్ నేపథ్యంలో కేటీఆర్ తో పాటు, హరీష్ రావు, కీలక నేతలు ఢిల్లీ చేరుకున్నారు. కవితకు బెయిల్ రాగానే తీహార్ జైలు అధికారులు ఆమెను వదిలివేసే ప్రాసెస్ ను పూర్తిగా చేశారు.

 

ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ చేరుకుంది. దారిపొడవున బీఆర్ఎస్ నేతలు.. కవితకు ఘన స్వాగతం పలికారు. కవిత తన కుటుంబాన్ని చూసి పలు మార్లు భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కవితను స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శంషాబాద్ చేరుకున్నారు.

కవిత మాట్లాడుతూ.. తనను కావాలని లిక్కర్ కేసులో ఇరికించారంటూ కూడా కవిత పలు మార్లు కాంగ్రెస్ పై, బీజేపీ మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు, కేసులకు, జైళ్లకుభయపడేది లేదంటూ కూడా ఫైర్ అయ్యారు.ఈ క్రమంలో కవిత హైదరాబాద్ లోని తన నివాసంలో చేరుకున్నారు. కేటీఆర్ కు రాఖీ సైతం కట్టి తమ అనుబంధాన్ని చాటు కున్నారు. ఈరోజు (గురువారం) కవిత.. ఎర్రవెల్లికి బయలుదేరారు.ఈ నేపథ్యంలో ఐదునెలల తర్వాత కూతురిని చూసిన కేసీఆర్ చాలా ఎమోషనల్ కు గురయ్యారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తివివరాలు..

లిక్కర్ స్కామ్ కేసులో కవితను.. ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఆ తర్వాత కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తాజాగా కవిత జైలు నుంచి విడుదలయ్యారు. తొలుత హైదరబాద్ చేరుకున్న కవిత.. ఈరోజు(గురువారం) తన తండ్రిని కలిసేందుకు వెళ్లారు. తండ్రిని ఐదు నెలల తర్వాత చూసిన కవిత కూడా భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. అదే విధంగా కేసీఆర్ సైతం.. తన కూతుర్ని ఆలింగనం చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కవిత తన తండ్రి కేసీఆర్ పాదాలకు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.

Read more: Huge crocodiles: వామ్మో.. ఇళ్లలోకి చొరబడుతున్న పెద్ద పెద్ద మొసళ్లు.. ఎక్కడో తెలుసా..?.. వీడియో వైరల్..  

తన బిడ్డను ఆత్మీయంగా కేసీఆర్ హత్తుకున్నారు. ఇదిలా ఉండగా.. అంతకు ముందు జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో కవిత బీజేపీపై, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని కూడా మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంతకన్న భారీగా అణచివేతలు చూశామన్నారు. తాను.. మోండిదాన్నని.. జైలులో పెట్టి మరింత జగమోండిని చేశారని కవిత మండిపడింది. తెలంగాణ కోసం మరింత గట్టిగా కోట్లాడుతామంటూ కూడా కవిత కేంద్రంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా మాస్ వార్నింగ్ ఇచ్చింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News