BRS: కేసీఆర్ (కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు) తిరిగి రాజకీయంగా బలంగా మారాలంటే ఉద్యమ పంథా ఎంచుకోవడమే సరైనదిగా భావిస్తుందా…?.త్వరలో మళ్లీ పుంజుకోవడానికి ఒక బలమైన అంశం తమకు లభించబోతుందన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నరా.. అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అందుకే చేతికి అందిన ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టొద్దని నేతలకు సూచిస్తుంది. అంతేకాదు తమ పార్టీ నేతలకు నైతికంగా మద్ధతు ఇవ్వడం కోసం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా స్వయంగా శాసనసభకు రావడంతో పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచారు.
మొన్నటి అసెంబ్లీ కాస్త షాక్ ఇస్తే.. పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ కు తప్పా మరో పార్టీకీ స్థానం లేదన్నట్లుగా ఉద్యమ పార్టీ చెప్పుకుంది. కానీ మొన్నటి ఎన్నికలతో బీఆర్ఎస్ కు అసలు విషయం తెలిసి వచ్చింది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు అవకాశం కల్పించారు. తెలంగాణ అభివృద్థిలో దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత తమదే అని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ను ప్రజలు ఆదరించలేదు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా బీఆర్ఎస్ ను ప్రజలు విశ్వసించ లేదు. తెలంగాణ ప్రజలకు , బీఆర్ఎస్ కు ఎక్కడో గ్యాప్ వచ్చింది. అది తెలుసుకునే లోపే బీఆర్ఎస్ కు రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే కనిపించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు రాజకీయంగా గడ్డు కాలం నడుస్తుంది. రోజుకొక ఎమ్మెల్యే పార్టీకీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.
బీఆర్ఎస్ లో సీనియర్లుగా చెప్పుకునే ముఖ్య నేతలు, అందులోను కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు సైతం బీఆర్ఎస్ ను వీడడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేకే, కడియం, పోచారం లాంటి నేతలు పార్టీనీ వీడి కాంగ్రెస్ లో చేరడం గులాబీ క్యాడర్ ను షాక్ కు గురి చేసింది. నేతలు ఒక్కొక్కరుగా పార్టీనీ వీడుతున్న గులాబీ బాస్ ఏం చేయలేని పరిస్థితిలో ఉండి పోయారు. ఒక దశలో పార్టీ ఎమ్మెల్యేలను ఫాం హౌజ్ కు పిలిపించుకొని బుజ్జగించినా ఫలితం మాత్రం శూన్యం. కేసీఆర్ తో భేటీ ముగిసిన రెండు రోజుల్లోనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం బీఆర్ఎస్ బాస్ తో పాటు క్యాడర్ ను పూర్తిగా డైలామాలో పడవేసింది.
ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కూడా ఎమ్మెల్యేలు పార్టీనీ వీడుతున్నా రోజుకొక జిల్లా నేతలతో సమావేశమవుతున్నారు. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటుంది తాత్కాలిమే భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామనే ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు జడ్పీ ఛైర్మన్లు, కీలక నేతలతో కేసీఆర్ నిరంతరం సమావేశమై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేపే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పార్టీ నుంచి వలసలను ఆపలేకపోతున్నారు. ఓ వైపు ఎమ్మెల్యేలు, మరో వైపు ఎమ్మెల్సీలు ఇలా పార్టీనీ వీడుతుండడంతో ఏం చేయాలో తెలియక గులాబీ బాస్ మదనపడుతున్నారు.
అయితే ఇదే సందర్భంలో తమ పార్టీకీ ఒక మంచి రాజకీయ అంశం ఏదైనా దొరకపోతుందా ...మళ్లీ పుంజుకోకపోతామా అనే యోచనలో గులాబీ పార్టీ అధినేత ఉన్నారు. అధికారంలో ఉన్నంత సేపు తమది ఫక్తు రాజకీయ పార్టీ అన్న కేసీఆర్ ఇప్పుడు తిరిగి తన పాత పంథానే కరెక్ట్ అని అనుకుంటున్నాడు. మరోసారి ఉద్యమ పంథా ఎంచుకుంటేనే పార్టీనీ కాపాడుకోగలం అని కేసీఆర్ భావిస్తున్నారట. అయితే ఏ అంశం పై పోరాడితే ప్రజలు మనకు కనెక్ట్ అవుతారో కేసీఆర్ లెక్కలు కడుతున్నారట. తెలంగాణ ఉద్యమ పునాదుల మీద ఏర్పడిన బీఆర్ఎస్ కు తెలంగాణ అంశాల మీదనే పోరాడితేనే పొలిటికల్ గా వర్కవుట్ అవుతుందనుకుంటున్నారట. గతంలో మాదిరి ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటున్నారట. గత ఏడు నెలలుగా కాంగ్రెస్ సర్కార్ పై పలు అంశాలపై పోరాడుతున్న పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని తెలంగాణకు సంబంధించిన అంశాలను రాజకీయంగా వాడుకొని ప్రజల్లో మరోసారి సెంట్ మెంట్ క్రియేట్ చేస్తే పార్టీనీ తిరిగి గాడిన పెట్టవచ్చు అని అనుకుంటున్నారట.
ఇక్కడే కేసీఆర్ కు ఒక ఆలోచన వచ్చిదంట...హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంట్రీ, విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంల భేటీనీ రాజకీయంగా ఎలా వాడుకోవాలో కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారట. రేవంత్ రెడ్డి, చంద్రబాబుల భేటీ తర్వాత వచ్చే ఎలాంటి నిర్ణయాలు వస్తాయి. ఆ నిర్ణయాల్లో తెలంగాణకు ఏ మాత్రం తేడా అనిపించినా పెద్ద ఎత్తున ఆందోళనలతో జనాల్లోకి వెళ్లాలనుకుంటుందట. ప్రస్తుతానికి కేసీఆర్ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు , ఆందోళనలు, దిష్టిబొమ్మల దహనాలతో మరో సారి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారట. అప్పటి వరకు ఫాం హౌజ్ లోనే నేతలతో చర్చలు జరపుతున్నారట. ఏదైనా రాజకీయం అంశం దొరికితే స్వయానా కేసీఆరే ఉద్యమ రంగంలోకి దూకాలనకుంటున్నారట.
ఇదే జరిగితే ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్టు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఒక వైపు పార్టీ నుంచి వలసలను ఆపినట్టు అవుతుంది. మరో వైపు తెలంగాణ ఉద్యమ సమయంలో లాగా పార్టీనీ వీడిన ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాలకు ప్లాన్ చేస్తుందట.ఇదే విషయాలను పార్టీలోని కొందరి ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించినట్లుగా ప్రచారం జరగుతుంది. ఇప్పటికే నిరుద్యోగుల ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ యువతను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో లాగా ఇక నుంచి బీఆర్ఎస్ చేయబోయే ఉద్యమాల్లో యువతను భాగస్వామ్యం చేయాలనుకుంటుందట. అప్పుడే ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగి అది బీఆర్ఎస్ కు రాజకీయంగా లాభం జరగుతుందని కేసీఆర్ ఆలోచనట. తమదైన రాజకీయ వ్యూహాలతో కేసీఆర్ కు రాజకీయంగా మరో అవకాశం ఇవ్వకుండా వ్యూహాలు రచిస్తారా వేచి చూడాలి.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter