BJP Madhavi Latha: హైదరాబాద్ నాదే.. ఒవైసీ ఖేల్ ఖతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..

Hyderabad: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఒవైసీ మీద ఫైర్ అయ్యారు. తమ నాయకుడు మోదీ మెడిటేషన్ చేసిన కూడా రచ్చ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 31, 2024, 03:43 PM IST
  • నలభై ఏళ్లలో పాతబస్తీ డెవలప్ మెంట్ శూన్యం..
  • రాహుల్ గాంధీని స్కూల్ లో చేర్పించాలన్న మాధవీలత..
BJP Madhavi Latha: హైదరాబాద్ నాదే.. ఒవైసీ ఖేల్ ఖతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..

Madhavi latha hot comments on asaduddion owaisi and rahul gandhi: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లీస్ నేత అసుదుద్దీన్ ఓవైసీలపై మండి పడ్డారు. ఇటీవల ఒక మీడియా ఇంటర్య్వూలో మాట్లాడిన ఆమె.. రాహుల్ గాంధీకి రాజ్యంగం గురించి ఏమి తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారీకి వెళ్లి మెడిటేషన్ చేసిన కూడా, ఈసీకి ఫిర్యాదు చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మనకు రాజ్యాంగం  కొన్ని ప్రాథమిక హక్కులను కల్పించిందని మాధవీలత అన్నారు. పాపం.. రాహుల్ గాంధీకి ఇవేం తెలివనీ.. ఆయన మరల స్కూల్ లో చేరి రాజ్యంగం గురించి చదివి అర్థం చేసుకొవాలని సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారం అనంతరం మోదీ ఎక్కడికి వెళితే వాళ్లకు ఎందుకని, ఇక శ్వాస తీసుకున్నా, మాట్లాడిన కూడా తమపై ఆంక్షలు విధిస్తారా.. అంటూ కాంగ్రెస్ ను దుయ్యబట్టారు.

Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..

ప్రతి ఒక్క వ్యక్తి వారి వారి కులా, మతాలకు అనుగుణంగా మందిరాలు,మసీదులు, దర్గాలు, ఇతర మత ప్రదేశాలలో వెళ్లి ప్రార్థనలు చేసుకొవడానికి రాజ్యంగం హక్కులు కల్పించింది. దీన్నిఎవరు కూడా అడ్డుకొవడానికి అధికారంలేదు. అలాంటిది వీళ్లు మోదీ మెడిటేషన్ చేస్తుంటే వీరికి వచ్చిన నష్టం ఏంటని మాధవీలత ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్ల మానసిక పరిస్థితి బాగాలేదని, ఇలాంటి వారు దేశానికి ఏంమంచిచేస్తారని మాధవీలత మండిపడ్డారు. మరోవైపు దేశంలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీనికి కూడా మాధవీలత స్ట్రాంగ్ గా కౌంటర్ గా ఇచ్చారు.

పగలు ఎక్కువగా పడుకుంటే పగటి కలలే వస్తాయని మాధవీలత అన్నారు. పగలు పడిన కలలు ఎప్పటికి కూడా నిజాలు కావని ఆమె చురకలు అంటించారు. ఇదిలా ఉండగా.. తమ దేశ ప్రధాని మోదీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే స్లోగన్ కు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు మంచి చేస్తున్నాడని అన్నారు. ముస్లింలకు ఇబ్బందికరంగా మారిన ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేశారన్నారు. ఆర్టికల్ 370, సీఏఏ వంటి చారిత్రాత్మక నిర్ణయాలను మోదీ అమలు చేశారని మాధవీలత అన్నారు. 

పాతబస్తీలో అసద్ సోదరులు నలభై ఏళ్లలో చేసిన మంచి పనిఏంలేదని, ఇప్పటికి కూడా అక్కడి ప్రజలు సరైన వసతులు లేక ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని మాధవీలత అన్నారు. హైదరాబాద్ లో.. తానుభారీ మెజార్టీతో గెలుస్తానని మాధవీలత ధీమా వ్యక్తం చేశారు. ఒవైసీ ఖేల్ ఖతం అంటూ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కొందరు ధనస్సు ఎక్కుపెట్టడంపైన రచ్చ చేశారు. అదే విధంగా ఎన్నికల సమయంలో నఖాబ్ ను తెరచి ఆధార్ కార్డు గుర్తింపు సరైన విధంగా ఉందా అనేదానిపై కూడా పరిశీలించారు. దీనిపై చాలా మంది రచ్చచేశారు. కానీ తాను.. రంజాన్ నేపథ్యంలో చార్మినార్ గుండా.. హజ్రత్ అలీ జులుస్ లో పాల్గొనడానికి వెళ్లానని, దీన్ని ఎవరు కూడా వివాదస్పదం చేయలేదని అన్నారు.

Read more: Snake bite: పగ పట్టిన పాము..?.. ఆరేళ్లలో ఆరుసార్లు కాటుకు గురైన మహిళ.. అసలు స్టోరీ ఏంటంటే..?

దీని వెనుక ఎవరి కుట్ర ఉందో దీన్ని చూస్తే తెలిసిపోతుందని మాధవీలత అన్నారు. ఈసారి మోదీ దేశంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని, హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాధవీలత అన్నారు. ఆనాడు హైదరాబాద్ కు నిజాం నుంచి విడుదల చేయించిన వల్లభాయ్ పటేల్ లాగా.. మోదీ 2026 లో పీఓకేను భారత్ లో విలీనం చేయడం ఖాయమని బీజేపీ మాధవీలత కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. అయోధ్యపై రాజకీయాలు తాము చేయడం మాధవీలత స్పష్టంచేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News