Bandi Sanjay Slams CM KCR: మళ్లీ సీఎం అవుతారనే నమ్మకం కేసీఆర్‌కే లేదని.. ఆ నమ్మకం ఉంటే టీఆర్ఎస్‌ను రద్దు చేసి కొత్త దుకాణం ఎందుకు తెరుస్తారు..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో అప్పులు తీరాలన్నా.. సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. అప్పుల కుప్పగా మారిన తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలన్నా బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం నియోకవర్గంలోని బొంగుళూరు సమీపంలోని కళ్లెం జంగారెడ్డి గార్డెన్‌లో జరిగిన జన్మదిన వేడుకలకు ఆయన హాజరయ్యారు.
'తెలంగాణ ఉద్యమం పేరుతో పెద్ద ఎత్తున దోచుకున్నారు కేసీఆర్. గతంలో చేసిన అప్పులు తీర్చలేక కేసీఆర్ వాహనాలను ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. అధికారంలోకి రాకముందు.. వచ్చిన తరువాత కేసీఆర్ ఆస్తులు అనూహ్యంగా పెరిగాయి. తెలంగాణ వచ్చాక పేదల బతుకులు మారలేదు. తెలంగాణ రాకముందు కంటే స్వరాష్ట్రం వచ్చాకే ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ పాలనలో ర్యాగింగ్, అత్యాచారాలు, ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు మద్దతుంటే అత్యాచారాలు, హత్యలు, ర్యాగింగ్ చేసిన దుండగులపై చర్యలు తీసుకోవడం లేదు.. గూండాలు, రౌడీలు రెచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదు..' అని బండి సంజయ్ అన్నారు.
మెడికో ప్రీతి నాయక్ ఆత్మహత్యపైనా.. కుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయినా.. ఆర్టీసీ ఉద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించని మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిన ద్రోహి అని అన్నారు. ఉస్మానియా, కాకతీయ వర్శిటీ విద్యార్థుల భవిష్యత్ నాశనమయ్యేలా కేసీఆర్ చర్యలు ఉన్నాయన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల మయం చేశారని.. గతంలో మద్యంపై 10 వేల కోట్ల ఆదాయముంటే.. నేడు రూ.40 వేల కోట్లు సంపాదిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
టీఆర్ఎస్ మూతపడ్డ ఫైనాన్స్ దుకాణం.. ఆ దుకాణానికి పెట్టిన కొత్త పేరే బీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు బండి సంజయ్. బీఆర్ఎస్‌లో చేరే వాళ్లంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ నేతలేనని విమర్శించారు. నెత్తిమీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా పనికి రాని నేతలే బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పులన్నీ తీర్చాలంటే కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణ అభివృద్ధిపైనా.. కేంద్రం ఇస్తున్న నిధులపైనా బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరినా స్పందించని మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు.
Also Read: Tax Saving Tips: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే వారికి గమనిక.. పన్ను ఇలా ఆదా చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bandi Sanjay: వాళ్లు నెత్తిమీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా పనికిరారు.. బండి సంజయ్ సెటైర్లు