Bandi Sanjay: ఒక వికెట్ క్లీన్‌బౌల్డ్.. కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: బండి సంజయ్ వార్నింగ్

Bandi Sanjay On MLC Kavitha: బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. టీచర్ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌లో భయం మొదలైందన్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 10:04 PM IST
  • బీఆర్ఎస్ కొనసాగేది మరో 3, 4 నెలలే
  • కేసీఆర్‌లో భయం మొదలైంది
  • బీజేపీ అధికారంలోకి రాగానే ఫస్ట్ తేదీనే జీతాలిస్తాం: బండి సంజయ్
Bandi Sanjay: ఒక వికెట్ క్లీన్‌బౌల్డ్.. కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: బండి సంజయ్ వార్నింగ్

Bandi Sanjay On MLC Kavitha: ‘‘కేసీఆర్ ముఖంలో భయం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అయ్యింది. తప్పు చేసినోళ్ల సంగతి తేలుస్తాం ’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది మరో 3, 4 నెలలేనని.. ఆ తరువాత అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఉద్యోగులకు ఫస్ట్ తేదీన జీతాలిస్తాం.. నెలరోజుల్లో డీఏలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 

వెంటనే పీఆర్సీని నియమించి అమలు చేసి.. ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ బదిలీలు, ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు టీచర్ల, ఉద్యోగుల సమస్యలు ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. టీఎన్జీవో నాయకుల చిట్టా తీస్తున్నామని, బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్‌లోని సుదర్శన్ ఫంక్షన్ హాలులో జరిగిన ఉపాధ్యాయ–అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

టీచర్ ఎన్నికలు ఈ ప్రాంతానికే పరిమితం కాదు.. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయి. తెలంగాణ ప్రజలంతా మీరిచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఏవీఎన్ రెడ్డి గెలవకపోతే కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కుతుంది. ఈరోజు కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్ సంతాప సభను తలపించింది. కేసీఆర్‌లో భయం మొదలైంది.. బిస్తర్ సర్దుకుంటున్నడు. రాత్రింబవళ్లు తాగుతున్నడు. టీఆర్ఎస్ గెలవడం సాధ్యం కాదని తెలిసే బీఆర్ఎస్ పేరుతో కొత్త దుకాణం తెరిచారు. ఉపాధ్యాయులకు జీతాలురావు, డీఏలు రావు, బదిలీలు, ప్రమోషన్లే లేవు. కేబినెట్ సమావేశంలో పీఆర్సీపై చర్చలేదు. టీచర్ల ఊసే లేదు..
 
దొంగ దందాలు చేసే కేసీఆర్ బిడ్డ దీక్ష చేస్తే ఏమనాలి..? ఆమె ఎవరి కోసం దీక్ష చేసింది..? దొంగ సారా దందా చేసినామే రద్రమదేవి, ఝాన్సీలక్ష్మీబాయి లెక్క దీక్ష చేస్తదట. దొంగ సారా దందాకు రూ.100 కోట్లు కేసీఆర్ బిడ్డకు ఎక్కడి నుంచి వచ్చాయి..? దొంగ సారా దందాతో వేల కోట్లు సంపాదించి దుబాయ్, మస్కట్‌లో దాచి పెడుతున్నారు. బీఆర్ఎస్ ఉండేది ఇంకా 3, 4 నెలలే.. ఈ విషయం తెలిసే కేసీఆర్ బిస్తర్ సర్దిపెట్టుకున్నరు. ఏం చేయాలో తెలియక రాత్రింబవళ్లు తాగుతూనే ఉన్నరు..' అని బండి సంజయ్ అన్నారు. 

బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సమానని అన్నారు. బీఆర్ఎస్‌లోకి వచ్చేవాళ్లంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ లీడర్లేనన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తున్న ఘనుడు కేసీఆర్ అని.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్రం ఇస్తున్న నిధులతో నడుస్తున్నాయన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలేనని.. సీఎం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం సిగ్గు చేటని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించి లబ్ది పొందేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

Also Read: Ind Vs Aus: సేఫ్ జోన్‌లో ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు.. భారత్ గెలవాలంటే..!  

Also Read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News