Teenmar Mallanna: కేసీఆర్.. నీకు మూడింది.. నీ గొయ్యిని నువ్వే తవ్వుకుంటున్నవ్ బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay On Teenmar Mallanna Arrest: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తారా..? అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తక్షణమే అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలని డిమాండ చేశారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 02:11 AM IST
  • ప్రశ్నించే గొంతులను అణిచివేస్తారా..?
  • మీడియా సంస్థల్లారా.. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గకండి
  • ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం కలిసి రండి: బండి సంజయ్ పిలుపు
Teenmar Mallanna: కేసీఆర్.. నీకు మూడింది.. నీ గొయ్యిని నువ్వే తవ్వుకుంటున్నవ్ బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay On Teenmar Mallanna Arrest: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు మూడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ.. దాడులు చేస్తూ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారన్నారు. తక్షణమే సీనియర్ జర్నలిస్టులు తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్, సుదర్శన్, సతీష్ కమాల్‌లను బేషరతుగా వదిలివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మంగళవారం రాత్రి  తీన్మార్ మల్లన్న నివాసానికి వచ్చిన బండి సంజయ్.. మల్లన్న కుటుంబ సభ్యులను కలిసి అరెస్ట్ వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రశ్నించే గొంతుకలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

'తీన్మార్ మల్లన్నను దొంగల్లా ఎత్తుపోతారా..? ప్రశ్నించే గొంతులను అణిచివేస్తారా..? కేసీఆర్.. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావ్. ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేసి ఏం చేయదల్చావ్. మీడియా సంస్థలారా... ఒక్కసారి మీరు ఆలోచించండి.. కేసీఆర్ ఒత్తిడి తలొగ్గితే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. మీరంతా ఏకం కండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. దొంగ సారా దందా చేసిన కవితను ఈడీ విచారణ చేస్తుంటే ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ వెళతారా..? ఆమె తప్పులను ప్రశ్నించిన మల్లన్నను, విఠల్‌ను దొంగల్లాగా ఎత్తుకపోతారా..? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కొడుకు పాత్ర ఉంది. ఇదే విషయాన్ని మల్లన్న చెబితే అరెస్ట్ చేస్తారా..?

మీకోసమే తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తున్నారు. మీరంతా అండగా ఉంటుందనే నమ్మకంతోనే ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సమాజమంతా మల్లన్నకు అండగా లేకుంటే.. అట్లా కాకుండా ఇంకా ఉపేక్షిస్తే సామాన్య ప్రజలెవరూ రోడ్లపై తిరిగే పరిస్థితి కూడా ఉండదు. మల్లన్న బిడ్డ పసిపాప. తండ్రిని చూడకుండా ఉండలేదు.. అల్లాడిపోతోంది. వెంటనే మల్లన్నను, విఠల్‌ను, సతీష్ కమాల్‌ను వెంటనే భేషరతుగా విడుదల చేయాలి. విఠల్ ఆరోగ్యం బాగోలేదు. ఏం జరిగినా సీఎందే బాధ్యత. తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదంతా కేసీఆర్ కొడుకు ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. ప్రజలు తిరగబడే సమయం వచ్చింది..' అని బండి సంజయ్ అన్నారు.

తీన్మార్ మల్లన్న, ఆయన అనుచరుడు, క్యూ న్యూస్ రీడర్‌ సుదర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం క్యూ న్యూస్ సిబ్బందిని బయటికి పంపించారు. ఆఫీసులో సోదాలు నిర్వహించారు. క్యూ న్యూస్ వద్ద మల్లన్నను అరెస్ట్ చేయగా.. నల్గొండలో సుదర్శన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని ఏ కేసులో.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదని క్యూ న్యూస్ సిబ్బంది చెబుతున్నారు. 

Also Read: MLC Kavitha ED Enquiry: ఊపిరిపీల్చుకున్న బీఆర్ఎస్ వర్గాలు.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ  

Also Read: MLC Kavitha: వరుసగా ఫోన్లను మార్చిన ఎమ్మెల్సీ కవిత.. రహాస్య వ్యవహారాల కోసమేనా..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News