KCR TARGET BJP: బీజేపీకి కేసీఆర్ తొలి దెబ్బ.. బీహార్ సంకీర్ణ కూటమిలో బీటలు! సంచలనం జరగబోతోందా?

KCR TARGET BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారా? బీజేపీ టార్గెట్ గా ఆయన పెద్ద స్కెచ్చే వేశారా? ఈ చర్చే కొన్ని రోజులుగా సాగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. హస్తిన కేంద్రంగా కీలక సమావేశాలు జరుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 11:39 AM IST
  • బీహార్ సంకీర్ణ కూటమికి బీటలు
  • ఎన్డీఏకు గుడ్ బై చెప్పనున్న నితీశ్?
  • నితీశ్ కుమార్ తో టచ్ లో ఉన్న కేసీఆర్
KCR TARGET BJP: బీజేపీకి కేసీఆర్ తొలి దెబ్బ.. బీహార్ సంకీర్ణ కూటమిలో బీటలు! సంచలనం జరగబోతోందా?

KCR TARGET BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారా? బీజేపీ టార్గెట్ గా ఆయన పెద్ద స్కెచ్చే వేశారా? ఈ చర్చే కొన్ని రోజులుగా సాగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. హస్తిన కేంద్రంగా కీలక సమావేశాలు జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో చర్చలు జరిపారు. పంజాబ్ సీఎంతో మాట్లాడారు. త్వరలోనే బెంగళూరు వెళ్లన్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ పర్యటకు వెళ్లి.. అక్కడి ముఖ్యమంత్రులతో చర్చలు జరపనున్నారు. వివిధ పార్టీల నేతలను కలుస్తున్న కేసీఆర్.. ఇటీవల ఢిల్లీలో కీలక ప్రకటన చేశారు. దేశంలో త్వరలో సంచలనం జరగబోతుందని అన్నారు. దీంతో కేసీఆర్ చెప్పిన సంచలనం ఏమై ఉంటుదనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఘటన ఆసక్తికరంగా మారింది. బీజేపీలో గుబులు రేపుతోంది.

బీహార్ లో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఉంది. జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీయూ కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా... ముఖ్యమంత్రి పదవిని బీజేపీ వదులుకుంది. నితీశ్ కుమార్ ను సీఎం చేసింది. అయితే కొన్ని రోజులుగా బీజేపీ- జేడీయూ మధ్య విభేదాలు వచ్చాయి. అవి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా సీఎం నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం.. సంకీర్ణ కూటమిలో చిచ్చు రాజేసింది. బీజేపీ అభ్యంతరాలను లెక్క చేయకుండా బీహార్ లో కుల గణనకు ఆదేశించారు సీఎం నితీశ్ కుమార్. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తు్ననా.. నితీశ్ కుమార్ కుల గణనకు ఆదేశించడం బీహార్ లో హీట్ పెంచుతోంది. కొన్ని రోజులుగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు నితీశ్ కుమార్. ఎన్నార్సీ, ఆర్టికల్ 370 అంశాల్లోనూ మోడీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు. బీహార్ లోనూ కొన్ని రోజులుగా మిత్రపక్షాన్ని సంప్రదించకుడానే పాలానాపరమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనతోనే నితీశ్ కుమార్ కుల గణన విషయంలో దూకుడుగా వెళుతున్నారని భావిస్తున్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ వైఖరితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లింక్ ఉందంటున్నారు. మొదటి నుంచి నితీశ్ కుమార్ తో కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. చాలాసార్లు నితీశ్ తో మాట్లాడారు కేసీఆర్. నితీశ్ కూడా కేసీఆర్ పాలనను మెచ్చుకుంటూ ఓపెన్ గానే ప్రకటనలు చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఈ ఇద్దరు నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలపై ఫోకస్ చేయడం.. వివిధ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్ కుమార్ నిర్ణయాలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్ ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కేసీఆర్ కూటమిలో నితీశ్ కుమార్ కూడా చేరబోతున్నారని.. అందుకే ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని చూస్తున్నారనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వస్తోంది.  త్వరలోనే సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లి నితీశ్ కుమార్ తో చర్చలు జరపనున్నారని.. ఆ సమావేశంలో కీలక నిర్ణయం ఉండబోతుందని సమాచారం. కేసీఆర్ చెబుతున్నట్లుగానే దేశ రాజకీయాల్లో కీలక పరిణామం జరగబోతుందనే ప్రచారం జరుగుతోంది.

నితీశ్ కుమార్ కు సంబంధించి మరో ప్రచారం కూడా సాగుతోంది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ కూటమికే మెజార్టీ ఉంది. కాని కావాల్సిన పూర్తి బలం లేదు. ఎన్డీఏ కూటమిని కాపాడుకుంటూనే  కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు బీజేపీకి అవసరం. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లోనే బీజేపీకి షాకివ్వాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బోటాబోటీ మెజార్టీతో ఉన్న బీజేపీకి.. కొన్ని ఎన్డీఏ పార్టీలను దూరం చేస్తే.. వాళ్లకు గండమే. ఈ దిశగానే కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న జేడీయూను బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా బీహార్ లో జరుగుతున్న పరిణామాలతో బీజేపీని కేసీఆర్ తొలి దెబ్బ కొట్టబోతున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తమ కూటమి ప్రెసిడెంట్ అభ్యర్థిగా నితీశ్ కుమార్ ను పెట్టాలనే యోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారని.. ఈ ప్రతిపాదనపైనే ప్రస్తుతం ఆయన బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని తెలుస్తోంది. మొత్తంగా కేసీఆర్ ఢిల్లీ మంత్రాంగం... బీహర్ రాజకీయ పరిణామాలకు లింక్ ఉందనే చర్చ కొన్ని వర్గాల్లో సాగుతోంది.  

READ ALSO: JAGAN KTR MEET: గల్లీలో కుస్తీ.. దావోస్ లో దోస్తీ! జగన్, కేటీఆర్ భేటీపై రాజకీయ రచ్చ..

READ ALSO: KCR Delhi Tour: ముగిసిన కేసీఆర్ ఢిల్లీ టూర్.. అనూహ్యంగా షెడ్యూల్ కన్నా ముందే హైదరాబాద్‌కు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News