Big Twist in Meerpet Murder Case: గురు మూర్తి కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. భార్య మాధవి మృతదేహాన్ని గురుమూర్తి ముక్కలుగా నరికి, వాటిని కుక్కర్‌లో ఉడికించినట్టు తొలుత భావించారు. కానీ, బకెట్ నీళ్లలో ముక్కలు వేస్తూ హీటర్ పెట్టి విడతల వారీగా ఉడికించినట్టు తాజాగా వెల్లడైనట్టు తెలిసింది. ఆ తర్వాత అవశేషాలను మీర్‌పేట చెరువులో పడేసి.. ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరక్కుండా ఇల్లంతా శుభ్రం చేశాడు.
కేసు ఫైల్ కావటంతో...అత్యాధునిక ‘బ్లూ రేస్ టెక్నాలజీ’తో ఆ ఇంట్లో మాంసం, రక్తం ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు.. గురుమూర్తే అసలు నిందితుడని నిర్దారణకు వచ్చారు. మృతదేహాన్ని నరకడానికి ఉపయోగించిన కత్తి, చెక్క మొద్దును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆ కత్తిని ఏం చేశాడు? అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
కొన్నాళ్ల కిందట బంధువుల ఇంట్లో జరిగిన వేడుకలో అత్తమామలు తనతో వ్యవహరించిన తీరును గురుమూర్తి తీవ్ర అవమానకరంగా భావించాడు. దానిని మనసులో ఉంచుకుని అవకాశం దొరికినప్పుడల్లా మాధవితో తరుచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ కోసం భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడే ఈ కుటుంబం పండుగ జరుపుకుంది. పిల్లలకు సెలవులు కావడంతో వారిని సోదరి ఇంటి దగ్గర వదిలేసి.. జనవరి 14న సాయంత్రం గురుమూర్తి, మాధవి తిరిగొచ్చారు. ఆ మర్నాడు రాత్రి మాధవితో గొడవపడిన గురుమూర్తి.. ఆమెను కొట్టి విసురుగా తోసేయడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది.
కంగారుపడిపోయిన గురుమూర్తి, కేసు తనపై రాకుండా మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో రాత్రంతా వీడియోలు చూసి జనవరి 16న ఉదయం భార్య మృతదేహాన్ని బాత్‌రూమ్ వద్దకు లాక్కెళ్లాడు. అక్కడ చెక్క మొద్దుపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ రోజంతా అదే పనిలో ఉన్న నిందితుడు.. రాత్రికి ఆ ముక్కల్ని బకెట్‌లో వేసి హీటర్‌తో ఉడికించాడు. అనంతరం వాటిని మూటగట్టి మీర్‌పేట పెద్ద చెరువులో పడేశాడు.అక్కడ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆధారాలు దొరక్కుండా ఇల్లంతా శుభ్రం చేశాడు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇంటి యజమాని కుటుంబంతో సహా బెంగళూరులో ఉండటం, పిల్లలు సోదరి ఇంట్లో ఉండటంతో గురుమూర్తికి కలిసొచ్చింది. జనవరి 17న మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తనతో గొడవపడి అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో మాధవి తల్లి సుబ్బమ్మ మీర్‌పేటకు వచ్చి.. అల్లుడితో కలిసి బంధువులు, తెలిసినవారి ఇళ్లలో వాకబు చేసింది. ఆ మర్నాడు అల్లుడితో కలిసి వెళ్లి మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఇంటికి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. గురుమూర్తి చెప్పినట్లుగా.. మాధవి ఇంట్లోంచి వెళ్లినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు. అతడి పైనే పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. తానే భార్యను చంపినట్లు ఒప్పుకున్నాడు. కానీ, బలమైన ఆధారాలు లభించకపోవడంతో బ్లూరేస్ టెక్నాలజీ సాయం తీసుకున్నారు. బాత్రూమ్‌లో, గదిలో ఉన్న దుస్తులపై, మృతదేహాన్ని ముక్క లు చేసిన చెక్క మొద్దుపై కంటికి కనిపించని మానవ అవశేషాలు టెక్నాలజీ ద్వారా లభించాయి. శాస్త్రీయ ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.....నేడు రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మీర్‌పేట పెద్దచెరువులో పోలీసులు గాలించారు. మృతదేహానికి సంబంధించిన మాంసం ముద్దలను గుర్తించినట్లు కూడా తెలిసింది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.