Bharat Bandh live updates: హైదరాబాద్: భారత్ బంద్ నేపథ్యంలో నేడు ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సి ఉన్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్శిటీ రిజిస్ట్రార్ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. డిసెంబర్ 9 నుంచి జరిగే అన్ని పరీక్షలు ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని, వాయిదా పడిన డిసెంబర్ 8 నాటి పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ని త్వరలోనే వెల్లడిస్తామని యూనివర్శిటీ అధికారులు తమ అధికారిక ప్రకటనలో తెలిపారు.
వ్యవసాయ చట్టాల్లో కేంద్రం తీసుకొచ్చిన సవరణలపై నిరసన వ్యక్తంచేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలు.. కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే ప్రణాళికల్లో భాగంగా డిసెంబర్ 8న భారత్ బంద్ చేపట్టాలని డిసెంబర్ 4న నిర్ణయంచుకున్న సంగతి తెలిసిందే. రైతు సంఘాలకు అండగా నిలుస్తూ పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికాయి. దీంతో నేడు దేశవ్యాప్తంగా చేపడుతున్న భారత్ బంద్‌లో ( Bharat Bandh ) భాగంగా ఎన్డీయేతర పార్టీలు, రైతులతో కలిసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తున్నాయి.
Also read : Bharat Bandh: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గృహ నిర్బంధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook