Jeevan Reddy Fire: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై టీఆర్ఎస్ నేతలు వరుసగా కౌంటర్ ఎటాక్ లు ఇస్తున్నారు. తాజాగా అమిత్ షాకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనదైన శైలిలో మూతోడ్ జవాబిచ్చారు. తుక్కుగూడ సభలో అమిత్ షా అబద్ధాలకు బాద్‌షాల మాట్లాడారని మండిపడ్డారు. అబద్దాలతో కూడిన అరుపులు తప్ప ఆ సభలో ఏం లేవని విమర్శించారు. అమిత్ షా కాస్త అల్జీమర్స్ షాలా మారడని ఎద్దేవాచేశాడు. తుక్కుగూడ సభ తర్వాత రాష్ట్రంలో బీజేపీ తుక్కు తుక్కు అవడం ఖాయమన్నారు.
తుక్కుగూడ సభపై జీవన్ రెడ్డి చలోక్తులు విసిరారు. కమలం సభ కామెడీ షోగా మారిందన్నారు. బండి సంజయ్ బెస్ట్ కమెడియన్‌గా.. అమిత్ షా బెస్ట్ విలన్ గా మాట్లాడరని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కన్ఫ్యూజన్ రెడ్డిగా మారిపోయాడని విమర్శించారు. అమిత్ షా ఆరోపించినట్టుగా కేసీఆర్ ది నిజాంపాలన కాదని.. నిజాల పాలన అని స్పష్టం చేశారు. తెలంగాణకు 2 లక్షల 52 వేల కోట్లు ఇస్తే.. ఆ డబ్బులన్నీ అమిత్ షా అకౌంట్లో వేసుకున్నారా లేక కిషన్ రెడ్డి ఖాతాలోకి వెళ్లాయా అని ప్రశ్నించారు. బీజేపీ అంటేనే బుద్ధి జ్ఞానం లేని పార్టీ అని విమర్శించారు.
అమిత్ షా తన స్పీచ్ లో 18 సార్లు కేసీఆర్ పేరు తీసుకువచ్చారని జీవన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ అంటే అమిత్ షాకు ఎంత భయమో అని దీన్నిబట్టే తెలుస్తోందన్నారు. రాజీవ్ గాంధీ గతంలో అంజయ్యను అవమానపర్చినట్టే.. అమిత్ షా బండి సంజయ్‌ను అవమాన పర్చాడని చెప్పారు. హోంశాఖ విషయాలే తెలియని అమిత్ షాకు ఆర్థికశాఖ విషయాలు ఎలా తెలుస్తాయని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పుల గురించి మాట్లాడే అర్హత షాకు లేదన్నారు. ఎనిమిదేళ్లలో లక్షల కోట్లు అప్పులు చేసిన మోదీ.. ఎన్ని గొప్ప పథకాలు తీసుకువచ్చారని ప్రశ్నించారు.
తెలంగాణలో ఎప్పుడూ ఎన్నికలు జరిగినా.. టీఆర్ఎస్ దే విజయమని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి మళ్లీ డిపాజిట్లు గల్లంతే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆటోక్రసీ పార్టీ అని.. బీజేపీ హిపోక్రసీ పార్టీ అని.. టీఆర్ఎస్ ఒక్కటే డెమోక్రసీ పార్టీ అని స్పష్టం చేశారు.
Also Read: India Covid: స్వల్పంగా తగ్గుతున్న కరోనా కేసులు, జాగ్రత్త తప్పదంటున్న వైద్యులు..!
Also Read: Talasani On Early Elections: ముందస్తుకు సిద్ధం.. తేల్చుకుందామా? బీజేపీకి మంత్రి తలసాని సవాల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి