Bairi Naresh Remand Report: కొద్దిరోజుల క్రితం వరకు బైరి నరేష్ అంటే ఎవరికీ తెలియదు కానీ అయ్యప్ప స్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా అతను తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. తాజాగా అతని వరంగల్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది.
ప్రస్తుతం అతన్ని పరిగి సబ్ జైల్లో ఉంచారు పోలీసులు. ఇక తాజాగా అతని రిమాండ్ రిపోర్ట్ మీడియా చేతికి చెక్కింది. పోలీసుల విచారణలో బైరి నరేష్ నేరం ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తాను ఉద్దేశపూర్వకంగానే అయ్యప్ప స్వామి మీద వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. డిసెంబర్ 19వ తేదీన ఈ కార్యక్రమం జరిగిందని ఉద్దేశ పూర్వకంగానే బైరి నరేష్ ని ఈ కార్యక్రమానికి పిలిచానని నరేష్ తో పాటు అరెస్టు అయిన ఈ కార్యక్రమం నిర్వాహకుడు హనుమంతు కూడా ఒప్పుకున్నట్లు చెబుతున్నారు.
బైరి నరేష్ తెలంగాణకు సంబంధించిన నాస్తిక సమాజం అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నారు, ఒక అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అయ్యప్ప స్వామి జననాన్ని కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడు. ఇక రిమాండ్ రిపోర్ట్ లో బైరి నరేష్ మీద గతంలో కూడా పలు కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు పోలీసులు.
హనుమకొండలో రెండు కేసులు నవాబుపేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉన్నాయని పేర్కొన్న పోలీసులు ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా బైరి నరేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఈ సమయంలో నలుగురు ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశామని చెబుతూ పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఉమాపతి గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook