Vaishali Kidnap Case: ప్లీజ్ ప్లీజ్ అని వేడుకున్నా.. నన్ను దారుణంగా కొట్టారు! గోళ్లతో గిచ్చి కొరికారు

Vaishali sensational comments on Naveen Reddy. మిస్టర్‌ టీ షాప్‌ ఓనర్‌ నవీన్‌ రెడ్డి తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశాడని అపహరణకు గురైన  వైద్య విద్యార్థిని వైశాలి మీడియాకు తెలిపింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 10, 2022, 08:12 PM IST
  • ప్లీజ్ ప్లీజ్ అని వేడుకున్నా
  • నన్ను దారుణంగా కొట్టారు
  • గోళ్లతో గిచ్చి కొరికారు
Vaishali Kidnap Case: ప్లీజ్ ప్లీజ్ అని వేడుకున్నా.. నన్ను దారుణంగా కొట్టారు! గోళ్లతో గిచ్చి కొరికారు

Vaishali makes sensational comments on Naveen Reddy: మిస్టర్‌ టీ షాప్‌ ఓనర్‌ నవీన్‌ రెడ్డి తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశాడని శుక్రవారం అపహరణకు గురైన  వైద్య విద్యార్థిని వైశాలి మీడియాకు తెలిపారు. తనను నవీన్‌ రెడ్డి, అతడి గ్యాంగ్ దారుణంగా కొట్టారని.. హెల్ప్‌ అని అరుస్తుంటే గోళ్లతో గిచ్చి కొరికారని తెలిపారు. నవీన్‌ రెడ్డితో తనకు పెళ్లి కాలేదని, ఫొటోస్ మార్ఫింగ్ చేసాడంన్నారు. నవీన్‌ దొరికిపోయాడు కాబట్టీ కాపాడుకునేందుక అతని తల్లి అబద్దాలు చెబుతోందని వైశాలి చెప్పుకొచ్చారు. శుక్రవారం సినీ ఫక్కీలో వైశాలిని నవీన్ కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు పలు ప్రత్యేక బృందాలుగా వెళ్లి గంటల్లోనే కిడ్నాపర్ల ఆటకట్టించారు. వైశాలిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. 

అపహరణకు గురైన దంత వైద్య విద్యార్థిని వైశాలి ఈరోజు సాయంత్రం మీడియాకు వచ్చి అన్ని వివరాలు తెలిపారు. 'నవీన్ రెడ్డితో నాకు పెళ్ళి కాలేదు. ఆ ఫోటోలు మార్ఫింగే. నువ్వంటే నాకిష్టం.. బాగా చూసుకుంటా అనేవాడు. నో అని చెబితే ఇంటి ముందుకొచ్చి న్యూసెన్స్‌ చేసేవాడు. కిడ్నాప్ చేసి నన్ను చిత్రహింసలకు గురిచేశారు. కారులో నవీన్ నన్ను దారుణంగా కొట్టాడు. జుట్టుపట్టుకుని ముఖంపై దాడి చేశాడు. మా పేరెంట్స్‌ కూడా అలా ఎప్పుడూ అలా కొట్టలేదు. చాలా ఘోరంగా ట్రీట్‌ చేశాడు. హెల్ప్‌ హెల్ప్‌ అని అరుస్తుంటే.. గోళ్తో గిచ్చి  కొరికాడు. నువ్వు అంటే అస్సలు ఇష్టం లేదని చెప్తున్నా వినిపించుకోలేదు' అని వైశాలి తెలిపారు. 

'నాకిష్టం లేదు ఎందుకు తీసుకొచ్చావ్ అని అడిగితె. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదన్నాడు. నాకు దక్కకుంటే నిన్ను ఎవరికీ దక్కనివ్వను చిత్ర హింసలకు గురిచేశాడు. నీ జీవితం ఇక్కడితో ఆగిపోతుందని బెదిరించాడు. చెప్పినట్టు వినకపోతే మా నాన్నను చంపేస్తానని బెదిరించాడు. కారులో నవీన్‌తో పాటు ఆరుగురు ఉన్నారు. నాపట్ల 10 మంది దారుణంగా వ్యవహరించారు. కాళ్లు పట్టుకొని లాగారు. నా కెరీర్‌ను నాశనం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. వారికి కఠిన శిక్ష వేయాలి' అని వైశాలి వేడుకున్నారు. 

'మాతో కలిసి నవీన్‌ బాడ్మింటన్‌ ఆడేవాడు. నవీన్‌తో పరిచయం ఉంది కానీ ప్రేమ లేదు. నవీన్‌ నాకు ప్రపోజ్‌ చేస్తే నో చెప్పా. నేనంటే ఇష్టమని చెప్తే.. పేరంట్స్‌ను అడగమని చెప్పా. నన్ను వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చా. పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే నాపై దాడి జరిగేది కాదు. నవీన్‌ దొరికిపోయాడు కాబట్టీ కాపాడుకునేందుక  అతని తల్లి అబద్దాలు చెబుతోంది. ఒక మహిళగా ఆలోచించాలి' అని వైశాలి పేర్కొన్నారు. 

Also Read: IND vs BAN 3rd ODI: బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం.. తప్పిన క్లీన్‌స్వీప్‌ గండం!

Also Read: Snake Eats Snake: బతికున్న రాటిల్ స్నేక్‌ను మింగేసిన కాటన్‌మౌత్ స్నేక్‌.. వీడియో చూస్తే పోసుకోవడం పక్కా!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

 

Trending News