ఏబీవీపీ ముట్టడి, అరెస్ట్.. ఇంటర్ బోర్డ్ వద్ద ఉద్రిక్తత..

రాష్ట్రంలోని ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ముట్టడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ కళాశాలల భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని, జీఓ 35 ని రద్దు 

Last Updated : Mar 3, 2020, 06:35 PM IST
ఏబీవీపీ ముట్టడి, అరెస్ట్.. ఇంటర్ బోర్డ్ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్: రాష్ట్రంలోని ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ ముట్టడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ కళాశాలల భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని, జీఓ 35 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు సంబంధించిన ప్రైవేట్ ఎయిడెడ్ ని తొలగించి ఎయిడెడ్ ని కొనసాగించాలని, ఎయిడెడ్ కళాశాలలో టీచింగ్,నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిరసన తెలియజేశారు. ఎయిడెడ్ కళాశాలలో అధ్యాపకులను ప్రభుత్వ కళాశాలలకు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఏబీవీపీ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. 

ఏబీవీపీ కార్యకర్తలు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకోగా, దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరోవైపు యూనివర్సిటీలలో ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను వెంటనే క్రమబద్దీకరించాలని, జేఎన్ఎఫ్ఏ విశ్వవిద్యాలయంలో వీసీ పదవీకాలం పూర్తై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం ఇప్పటి వరకు ఇంచార్జి  వైస్ ఛాన్సలర్ ను నియమించకపోవడం దురదృష్టకరమని, అదేవిధంగా ఆర్జీయూకేటీ యూనివర్సిటీ కి తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు వీసీ లేకపోవడం సిగ్గుచేటని, తెలంగాణాలో విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News