Top 10 IT Courses: ఇండియాలో డిమాండ్ టాప్ 10 ఐటీ కోర్సులు ఇవే.. ఓ లుక్కేయండి

Best IT Courses in India: సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా సైన్స్ వరకు విద్యార్థులకు చాలానే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మన దేశ సాంకేతిక మెరుగుదలకు దోహద పడే అగ్ర శ్రేణి నిపుణులను సృష్టించే దిశగా ఈ 10 ఐటీ కోర్సులు మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2023, 11:19 PM IST
Top 10 IT Courses: ఇండియాలో డిమాండ్ టాప్ 10 ఐటీ కోర్సులు ఇవే.. ఓ లుక్కేయండి

Best IT Courses in India: డిగ్రీ పూర్తయ్యాక కూడా దాదాపు విద్యార్థులు అందరూ ఉద్యోగం లేకుండానే కష్టాలు పడుతున్నారు. ఏదో ఒక కోర్సు నేర్చుకోకుండా జాబ్ తెచ్చుకునే వారి సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ మార్కెట్ లో ఉన్న వేల కోర్సుల లో ఏది నేర్చుకోవాలని అందరికీ బోలెడు సందేహాలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం అంటే 2023లో మన మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్ 10 కోర్సులు ఏంటో ఒక సారి చూద్దాం..

1.ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కోర్సు

ఫుల్-స్టాక్ డెవలప్‌మెంట్ కోర్సు అనేది విద్యార్థులకు వెబ్‌సైట్‌లను పూర్తిస్థాయిలో రూపొందించగలిగే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ రెండూ కూడా ఈ కోర్సులో కవర్ అవుతాయి. హెచ్ టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వంటి లాంగ్వేజెస్‌తో పాటు యాంగులర్ జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, రీయాక్ట్, జేక్వెరీ వంటి ఫ్రేమ్‌ వర్క్‌లను ఉపయోగించడం ద్వారా విద్యార్థులు ఈ కోర్సుతో ఒక ఇంటర్‌ఫేస్ డిజైన్ చేస్తారు. అంతే కాకుండా క్లయింట్ ఇంటరాక్షన్ గురించి కూడా పూర్తి అవగాహన తెచ్చుకుంటారు. వెబ్‌ సైట్‌లు, యాప్‌లను నడిపించే కోడ్‌పై కూడా ఈ కోర్సు దృష్టి పెడుతుంది. వీటిలో పీహెచ్‌పీ, పైథాన్, జావా, సీప్లస్ ప్లస్, జావా స్క్రిప్, యు నోడ్.జే ఎస్ ఇతర లాంగ్వేజ్‌లు, ఫ్రేమ్‌ వర్క్‌లు కూడా ఉంటాయి.

2.వెబ్ డిజైనింగ్ కోర్సు

వెబ్ డిజైన్ కోర్సు తీసుకునే విద్యార్థులు యూజర్ ఫ్రెండ్లీ వెబ్‌ సైట్‌లను రూపొందిస్తారు. వెబ్ డిజైన్ ప్రాథమిక అంశాలతో పాటు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, యూ ఎక్స్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, మల్టీ మీడియా టెక్నాలజీస్, జావా స్క్రిప్ట్‌లను కూడా ఈ కోర్సు కవర్ చేస్తుంది. 

3.క్లౌడ్ కంప్యూటింగ్

క్లౌడ్ కంప్యూటింగ్ సూత్రాలు, టెక్నాజీలను ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. ఇంటర్నెట్‌లో డేటా స్టోరేజ్, సర్వర్లు, డేటాబేస్‌లు, నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్ అనలిటిక్స్ వంటి వాటి గురించి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సులో అందుబాటులో ఉంటాయి.

4.డేటా సైన్స్ కోర్సు

డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, పైథాన్ లేదా ఆర్ 3 వంటి ప్రోగ్రామింగ్ భాషలు అన్నీ డేటా సైన్స్ కోర్సులో పరిధిలోకి వస్తాయి. డేటా సెట్‌లను అర్థం చేసుకొని, ట్రెండ్‌లను గుర్తించడం మాత్రమే కాక ప్రిడిక్షన్ మోడల్‌లను కూడా అభివృద్ధి చేయడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది.

5.మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్

స్మార్ట్‌ ఫోన్‌లు, టాబ్లెట్‌ల కోసం యాప్‌లను డిజైన్ చేయడం ఎలా అనేది మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోర్సులో నేర్చుకోవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, ఫ్రేమ్‌ వర్క్‌లు, టూల్స్, డిజైన్, టెస్టింగ్, డిప్లాయ్‌మెంట్ ఈ కోర్సులో కవర్ అవుతాయి. మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోర్సు సహాయంతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ లేదా విండోస్ వంటి అనేక ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఈ యాప్‌లను డిజైన్ చేయవచ్చు.

6.పైథాన్ కోర్సు

పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా ఇష్టమైన వారికి ఈ కోర్సు అనుకూలంగా ఉంటుంది. లాంగ్వేజ్‌తో పాటు దానిని ఉపయోగించి ఎలా ప్రోగ్రామ్ చేయాలో కూడా ఈ కోర్సులో విద్యార్థులు నేర్చుకోవచ్చు. పైథాన్ ఫండమెంటల్స్, సింటాక్స్, డేటా స్ట్రక్చర్స్, ఫంక్షన్స్, మాడ్యూల్స్, లైబ్రరీలు గురించి మాత్రమే కాక వెబ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఇతర ఫీల్డ్‌లలో ఈ కోర్స్ వల్ల ఉండే ఉపయోగాలను విద్యార్థులు తెలుసుకుంటారు. 

7.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో ముఖ్యంగా నేర్పించేవి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్‌లు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. టెన్సార్ ఫ్లో పై టార్క్, గూగుల్ క్లౌడ్ వంటి బాగా ఉపయోగించే ఫ్రేమ్‌ వర్క్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చరిత్ర, అప్లికేషన్‌లు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు.

8.మీన్ స్టాక్ డెవలపర్ కోర్సు

డైనమిక్ వెబ్ యాప్‌లను ఎలా నిర్మించాలో విద్యార్థులకు బోధించే లెర్నింగ్ ప్రోగ్రామ్ ఈ కోర్సు. డేటాబేస్, సర్వర్, ఫ్రంట్-ఎండ్, బ్యాక్-ఎండ్ డెవలప్‌మెంట్ కోసం "మీన్ స్టాక్" ని తయారు చేయడం ఈ కోర్స్ ముఖ్య ఉద్దేశం. 

9.సైబర్ సెక్యూరిటీ

ఇటీవల సైబర్ నేరాలను అడ్డూ అదుపులేకుండా పోతుంది. వాటిని ఎలా అరికట్టాలో ఈ కోర్స్‌లో నేర్చుకోవచ్చు. నెట్‌వర్క్ సెక్యూరిటీ, వెబ్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, ఇతర ముఖ్యమైన అంశాలు సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఉంటాయి.

10.బిగ్ డేటా అనలిటిక్స్

ఎన్నో రకాల సాధనలు, పద్ధతులను వినియోగిస్తూ భారీ డేటాని సైతం సులువుగా ఎలా విశ్లేషించాలో తెలియస్తుంది బిగ్ డేటా అనలిటిక్స్. హడూప్, హైవ్, స్పార్క్, కాఫ్కా, ఇతరత్రా విషయాలు ఈ బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సులలో కవర్ అవుతాయి. వివిధ రకాల యాప్‌లు, డేటా విలువను అర్థం చేసుకోవడంలో బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సు విద్యార్థులకు చాలా బాగా సహాయ పడుతుంది.

Also Read: Assembly Elections 2023: ఎన్నికల కోడ్ అంటే ఏమిటి..? రూల్స్ ఎలా ఉంటాయి..? పూర్తి వివరాలు ఇవే..   

Also Read: Chandrabau Case: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంలో విచారణ శుక్రవారానికి వాయిదా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News