Acer I Pro Series 127 Cm Smart Tv Offer: గతంలో కంప్యూటర్ మనీటర్స్ ఎక్కువగా ప్రముఖ ఈ టెక్ కంపెనీ ఏసర్ మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేసేవారు. ఇవి ప్రీమియం పిక్చర్ క్వాలిటీతో పాటు స్లిమ్‌గా ఉంటాయి. అయితే ఇతర బ్రాండ్స్ కూడా మార్కెట్‌లో మనీటర్స్‌ను సేల్ చేయడంతో కాస్త డిమాండ్ తగ్గిపోయింది. అయితే ఈ ఏసర్ కంపెనీ కొత్త టీవీల తయారీ కూడా ప్రారంభించింది. కొత్త కొత్త ఫీచర్స్‌తో అద్భుతమైన టీవీలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ప్రస్తుతం ఈ టీవీలు మార్కెట్‌లో మల్టీ నేషనల్ బ్రాండ్ టీవీలతో పోటీ పడుతున్నాయి. అయితే ఈ టీవీలు ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా అత్యధిక తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. ఏసర్‌కు సంబంధించిన ఏ మోడల్ టీవీలు అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి.
ఏసర్ కంపెనీ గతంలో విడుదల చేసిన I ప్రో సిరీస్ స్మార్ట్ టీవీపై ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది. మార్కెట్‌లో ఇది AR50UDIGU2875AT మోడల్‌లోని 127 cm సెంటిమీటర్స్‌లో విడుదలైంది. ఈ స్మార్ట్‌టీవీలో అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిని కంపెనీ మార్కెట్‌లో MRP ధర రూ.62,999తో విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌టీవీని ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 57 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో అన్ని ఆఫర్స్ పోనూ.. రూ.26,999కే పొందవచ్చు. ఇవే కాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
50 అంగుళాలు కలిగిన ఈ ఏసర్ I ప్రో సిరీస్ స్మార్ట్‌టీవీని ప్రత్యేకమైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే దీనిని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, Federal బ్యాంక్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి కూడా రూ.1,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోనూ కేవలం రూ.25,999కే పొందవచ్చు. ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించిన ప్రత్యేకమైన తగ్గింపు పొందవచ్చు.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇక ఈ స్మార్ట్‌టీవీకి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఐదు పరిమాణాలతో పాటు మూడు టెక్నాలజీల్లో అందుబాటులో ఉంది. ఇందులో కంపెనీ Netflix, ప్రైమ్ వీడియో, Disney+Hotstar, Youtube వంటి యాప్స్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌టీవీ Google TV ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీంతో పాటు అల్ట్రా HD (4K)తో పాటు 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో విడుదలైంది. అలాగే 36 W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. దీని డిస్ల్పే 60 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.