Samsung Galaxy S23 Price: బంపర్ ఆఫర్.. సగం ధరకే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌! ఎగబడుతున్న జనాలు

Buy Samsung Galaxy S23 5G Only @ Rs 36999" ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్'లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 22, 2023, 08:21 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్
  • సగం ధరకే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్23
  • ఎగబడుతున్న జనాలు
Samsung Galaxy S23 Price: బంపర్ ఆఫర్.. సగం ధరకే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌! ఎగబడుతున్న జనాలు

Buy Samsung Galaxy S23 5G SmartPhone Only @ Rs 36999: సౌత్ కొరియాకు చెందిన 'శాంసంగ్' మొబైల్ సంస్థలు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. శాంసంగ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన గెలాక్సీ 23 (Samsung Galaxy 23) సిరీస్‌ని గత నెలలో రిలీజ్ చేసింది. ఈ సిరీస్ యొక్క వనిల్లా మోడల్ గొప్ప డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్లు మొబైల్ ప్రియులకు బాగా నచ్చాయి. గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 74999. అయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్'లో చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. 

Samsung Galaxy S23 Price:

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అసలు ధర (Samsung Galaxy S23 8 GB RAM + 256 GB స్టోరేజ్) రూ. 95999. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 79999కి అందుబాటులో ఉంది. అంటే.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 16% తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23ని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే మీరు ఏకంగా రూ. 16000 ఆదా చేసుకోవచ్చు. ఈ అమౌంట్ కూడా మీకు భారం అయితే.. బ్యాంక్ మరియు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్స్ కారణంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

Samsung Galaxy S23 Bank Offers:

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌ను మీరు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ. 3000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. 5000 షాపింగ్ చేసే వారి కోసం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది కాకుండా HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే.. 5 వేల రూపాయల తగ్గింపు అందుబాటులో ఉంటుంది. అంటే మొత్తం రూ. 8000 తగ్గింపు లభిస్తుంది. 

Samsung Galaxy S23 Exchange Offer:

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌పై 35 వేల రూపాయల ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే మీకు ఇంత మొత్తం లభిస్తుంది. అయితే మీ పాత ఫోన్ మంచి కండీషన్‌ బాగుండాలి. లేటెస్ట్‌ మోడల్ అయి ఉండి.. ఎలాంటి డామేజ్ లేకుంటే 35 వేల ఎక్స్‌ఛేంజ్ మీకు లభిస్తుంది. మీరు పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ ధర రూ. 36999 అవుతుంది. అప్పుడు సగం ధరకే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్23ని మీరు కొనుగోలు చేయొచ్చు. 

Also Read: Tata CNG 2023: బైక్ ధరలోనే టాటా సీఎన్‌జీ కారు.. ఏకంగా 26 కిలోమీటర్ల మైలేజ్! స్టైలిష్ లుక్  

Also Read: Shreyas Iyer IPL 2023: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2023 నుంచి భారత స్టార్ ప్లేయర్ ఔట్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News