Samsung Galaxy S24 Ultra: శాంసంగ్ నుంచి కొత్తగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా నిన్న జనవరి 22న లాంచ్ అయింది. ఈ క్రమంలో మునుపటి మోడల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గత ఏడాది ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా లాంచ్ అయిన ఈ ఫోన్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్త మోడల్ లాంచ్ కావడంతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అసలు Samsung Galaxy S24 Ultra ఫీచర్లు, ధర, ప్రత్యేకతలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Samsung Galaxy S24 Ultra అనేది 6.8 ఇంచెస్ డైనమిక్ ఎమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. క్యూహెచ్‌డి రిజల్యూషన్ సపోర్ట్ చేస్తూ 2500 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది. ఈ ఫోన్ అత్యంత ఆధునికమైన క్వాల్ కామ్ స్నాప్ డ్రాగ్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్, పవర్ హంగర్ యాప్స్‌కు ఇది చాలా అనువైంది. ఇక కెమేరా సెటప్ అయితే చాలా ప్రత్యేకం. మెయిన్ కెమేరా ఏకంగా 200 మెగాపిక్సెల్ కలిగి ఉండే ట్రిపుల్ కెమేరా సెటప్‌తో వస్తోంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 10 మెగాపిక్సెల్ టెలీఫోటో ఉన్నాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy S24 Ultra 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్ అసలు ధర 1,29,999 రూపాయలు. ప్రస్తుతం అమెజాన్‌లో 30 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తోంది. అంటే ఈ ఫోన్ ఇప్పుడు 99,999 రూపాయలకే లభించనుంది. ఇది కాకుండా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 వేల రూపాయలు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర బ్యాంకు కార్డులతో కూడా క్యాష్‌బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Also read: SIP Investment: ఎస్ఐపీతో 21 కోట్లు సంపాదించాలంటే నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి