Jio Plans: జియో నుంచి కళ్లు చెదిరే ప్రీపెయిడ్ ప్లాన్, 14 ఓటీటీలు, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా ఫ్రీ

Jio Plans: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలీకం సంస్థ రిలయన్స్ జియో. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. హైస్పీడ్ డేటాతో పాటు ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు అందిస్తోంది. జియో అందించే బెస్ట్ ప్రీ పెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2024, 07:22 PM IST
Jio Plans: జియో నుంచి కళ్లు చెదిరే ప్రీపెయిడ్ ప్లాన్, 14 ఓటీటీలు, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా ఫ్రీ

Jio Plans: జియో ఇటీవల ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పుల ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, ఉచిత ఓటీటీ సేవలు అందనున్నాయి. అందులో అతి ముఖ్యమైన ప్లాన్ జియో 749 ప్రీ పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ కాల పరిమితి 90 రోజులుంటుంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా అంటే 90 రోజులకు 180 జీబీ డేటా పొందవచ్చు. అంతేకాకుండా ఏ నెట్‌వర్క్, ఏ నెంబర్‌కు అయినా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

అన్నింటికంటే ముఖ్యంగా జియో అందిస్తున్న 749 ప్రీ పెయిడ్ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపించుకోవచ్చు. 5జి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది. ఇంకా స్పష్టంగా అర్ధం అవాలంటే రోజుకు 8 రూపాయలు చెల్లిస్తే చాలు. అంతరాయం లేకుండా 5జీ సేవలు పొందవచ్చు. ఇంకా ఇతర ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చెక్ చేద్దాం.

జియో 2999 ప్లాన్ అనేది 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. డేటా ఎక్కువగా వినియోగించుకునేవారికి ఇది ప్రయోజనకరం. అన్‌లిమిటెడ్ కాలింగ్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఫ్రీ యాక్సెస్ లభిస్తాయి. 5జి డేటా అన్‌లిమిటెడ్ ఉంటుంది. 

ఇక జియో 1198 ప్రీ పెయిడ్ ప్లాన్ అనేది 84 రోజులకు వర్తిస్తుంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా ఉచితంగా లభిస్తాయి. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, జియో సినిమా, లయన్స్ గేట్‌ప్లే, డిస్కవరీ ప్లస్, డోకుబే, ఎపిక్ ఆన్, సన్ నెక్స్ట్, హోయ్‌చోయ్, చౌపాల్, ప్లానెట్ మరాఠీ, కాంచా లాంకా, జియో క్లౌడ్ సేవలు అంటే మొత్తం 14 ఓటీటీలు ఫ్రీగా లభిస్తాయి. ఇవి కేవలం మొబైల్ ఎడిషన్ ఓటీటీ సేవలు మాత్రమే. 84 రోజులకే వర్తిస్తాయి.

ఇక మరో ప్లాన్ 299 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్. ఇది కేవలం 28 రోజులకే వర్తిస్తుంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిడెట్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది. 

ఇక 84 రోజుల కాల వ్యవధితో 1099 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ మరొకటి ఉంది. ఇందులో రోజూకు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా ఉచితంగా యాక్సెస్ ఉంటుంది. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ఎడిషన్ 84 రోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. 

Also read: BSNL Plans: 100 ఎంబీపీఎస్ స్పీడ్, ఉచిత ఓటీటీ సేవలు, అన్‌లిమిటెడ్ కాల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News