Motorola: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో Motorola Edge 50 Fusion మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!

Motorola Edge 50 Fusion: 68W ఫాస్ట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్‌లోకి మరో Motorola స్మార్ట్‌ఫోన్‌ రాబోతోంది. ఇది అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా సెటప్‌తో రాబోతోంది.       

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 10, 2024, 10:42 AM IST
Motorola: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో Motorola Edge 50 Fusion మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!

Motorola Edge 50 Fusion: ప్రముఖ మొబైల్ బ్రాండ్‌  Motorola త్వరలోనే గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేయబోతోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్‌కి మంచి గుర్తింపు లభించడంతో.. వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు మరో శక్తివంతమైన మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అలాగే ఈ మొబైల్‌కి సంబంధించిన పేరు కూడా ఇటీవలే లీక్‌ అయ్యింది. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను Motorola Edge 50 Fusion పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఏంటో, వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Motorola కంపెనీ ఈ Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి వచ్చే వారంలో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ను కూడా అప్పుడే అధికారికంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్‌కి సంబంధించిన లాంచ్ గురించి మైక్రో పేజీని ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫాం ఇప్పటికే  డిప్లే కూడా చేస్తోంది.ఈ స్మార్ట్‌ఫోన్‌ Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు ఇటీవలే లీక్‌ అయిన వివరాల్లో పేర్కొన్నారు. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ డ్యూయల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌తో రాబోతోంది.  ఇది 5000mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ బ్యాకప్‌తో మార్కెట్‌లో లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది ఫారెస్ట్ బ్లూ, మార్ష్‌మల్లో బ్లూ, హాట్ పింక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది మరెన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. 

Motorola Edge 50 Fusion ఫీచర్లు, స్పెషిఫికేషన్స్‌:
ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌  6.7-అంగుళాల పూర్తి HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి  ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ స్క్రీన్‌ 2000 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1200 x 2780 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో రాబోతోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. ఇక ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్ 14 OS సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది Qualcomm Snapdragon 7 Gen 2 SoC ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు కంపెనీ ఇందులో ర్యామ్‌, స్టోరేజ్‌ను పెంచుకునేందుకు ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
కెమెరా సెటప్:
ఇక ఈ Motorola Edge 50 Fusion మొబైల్ కెమెరా సెటప్‌ వివరాల్లోకి వెళితే, ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇందులోని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులోని ఫ్రంట్‌ కెమెరా విషయానికొస్తే, 50 లేదా 32 మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ 5000 mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు  ఇది 68W ఫాస్ట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌ ఫీచర్‌తో రాబోతోంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News