Google Pixel 8 Price Cut: రూ.24,000 తగ్గింపుతో Google Pixel 8ను డెడ్ చీప్‌ ధరకే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!

Google Pixel 8 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Google Pixel 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అద్భుతమైన డీల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ మొబైల్‌ అద్భుతమైన ఆఫర్స్‌తో పొందండి. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 2, 2024, 05:23 PM IST
Google Pixel 8 Price Cut: రూ.24,000 తగ్గింపుతో Google Pixel 8ను డెడ్ చీప్‌ ధరకే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!

Google Pixel 8 Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ గూగుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 8 లాంచ్‌ చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. అయితే ఈ మొబైల్‌ కొన్ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా ఈ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను రూ.24,000 వరకు డిస్కౌంట్‌తో పొందవచ్చు. ఈ మొబైల్‌ను ఇటీవలే విడుదలైన Pixel 8a కంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
  
ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8 మొబైల్‌ తక్కువ ధరతో లభించడమే కాకుండా గూగుల్ పిక్సెల్ 8 ప్రో కూడా రూ. 17,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ డిస్కౌంట్‌ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో 8GB ర్యామ్‌ 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన Google Pixel 8 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 75,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీనిని ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కేవలం రూ. 63,999కే పొందవచ్చు. దాదాపు ఈ మొబైల్‌పై రూ. 12,000 తగ్గింపు ఫ్లాట్‌ తగ్గింపు లభిస్తుంది.

అలాగే అదనంగా బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తున్నాయి. ICICI బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్‌తో ఈ మొబైల్‌ కొనుగోలు చేసే క్రమంలో బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 8,000 తగ్గింపును పొందవచ్చు. దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ఆఫర్‌ను వినియోగిస్తే దాదాపు రూ. 4,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఈ మొబైల్‌పై రూ.24,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.39,999కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.2-అంగుళాల OLED డిస్‌ప్లే
మోడల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌
Google Tensor G3 చిప్‌సెట్
Titan M2 సెక్యూరిటీ చిప్‌
8GBర్యామ్, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌
8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌ వేరియంట్‌
రెండు ప్రధాన కెమెరాలు
50M ప్రధాన కెమెరా 
12MP రెండవ కెమెరా
27W ఛార్జింగ్ సపోర్ట్‌
4575 mAh బ్యాటరీ

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News