iPhone15 Price & Feature Leaked: లీకైన యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ డిజైన్.. అవేంటో మీరే చూడండి!

iPhone15 Leaked: యాపిల్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 లాంచ్‌కు 5 నెలలే మిగిలింది. ఐఫోన్ 15 డిజైన్ ఎలా ఉంటుంది, ఫీచర్లు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది అప్పుడే ఐపోన్ ప్రేమికుల్లో. ఐఫోన్ ప్రేమికుల ఆసక్తికి తగ్గట్టే గుడ్‌న్యూస్ అందింది. ఐఫోన్ 15 డిజైన్ లీకైంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2023, 05:06 PM IST
iPhone15 Price & Feature Leaked: లీకైన యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ డిజైన్.. అవేంటో మీరే చూడండి!

iPhone15 Leaked features & Price: ఐఫోన్ అలవాటైతే మరే ఇతర ఫోన్ వినియోగించలేరు. కష్టమైనా, జేబుకు భారమైనా అదే వాడతారు. అందుకే ఏడాదికోసారి విడుదలయ్యే ఐఫోన్ కొత్త సిరీస్ కోసం నిరీక్షణ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు యాపిల్ ప్రేమికులంతా ఐఫోన్ 15 కోసం నిరీక్షిస్తున్నారు. 

ఐఫోన్ 14 సిరీస్‌లో డైనమిక్ ఐల్యాండ్ ప్రవేశపెట్టారు. డిజైన్ కూడా కొద్దిగా మారింది. ఈసారి ఐఫోన్ 15 లాంచ్ కానుంది. లాంచ్ కంటే ముందే 15 సిరీస్ చర్చనీయాంశమౌతోంది. ప్రధానంగా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఎలా ఉంటాయనే చర్చ ఉంది. ప్రతి యేటా సెప్టెంబర్ నెలలో యాపిల్ తన ఐఫోన్ సిరీస్ లాంచ్ చేస్తుంటుంది. ఇప్పటి వరకూ ఐఫోన్‌లో 14 సిరీస్‌లు లాంచ్ కాగా ఇప్పుడు అందరి దృష్టీ ఐఫోన్ 15పై పడింది. 2002లో ఐఫోన్ 14 లాంచ్ తరువాత అందరూ ఐఫోన్ 15 ఎలా ఉంటుందనే చర్చ ప్రారంభించారు.

ఇప్పుడు మరో 5 నెలల్లో ఐఫోన్ 15 లాంచ్ కావల్సి ఉంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఎలా ఉంటుందనే చర్చకు ఇప్పుడు తెరపడుతోంది. కారణం ఐఫోన్ 15 ప్రో డిజైన్ లీక్ అయింది. ఇందులో రౌండ్ ఎడ్జ్ డిజైన్, న్యూ బటన్, కెమేరా బంప్, టైటానిక్ ఫ్రేమ్ కన్పిస్తున్నాయి. 

పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉంటాయా

దీంతోపాటు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఓ చిన్న కెమేరా ప్రోట్రూషియన్స్ సపోర్ట్ చేస్తుంది. పెరిస్కోపిక్ జూమ్ లెన్స్ ఉంటాయనే వార్తలు విన్పిస్తున్నాయి. ఐఫోన్ 15 ప్రో కెమేరాలో పూర్తిగా కొత్త సెన్సార్ టెక్నిక్ ఉంటుందని తెలుస్తోంది. ఇది ఎక్కువ వెలుగును సైతం క్యాప్చర్ చేస్తుంది. కొన్ని సెట్టింగ్స్ ప్రకారం ఓవర్ ఎక్స్‌పోజర్, లేదా అండర్ ఎక్స్‌పోజర్ తగ్గించుకోవచ్చు.

Also Read: FD Interest Rates: రెపోరేటు పెరగకపోయినా..ఎఫ్‌డి వడ్డీ రేటు పెంచిన ఐవోబీ, ఇవాళ్టి నుంచే అమలు

యూఎస్‌బి సి పోర్ట్

యూఎస్‌బి సి పోర్ట్ ఐఫోన్ 15లో ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. కానీ సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ యాపిల్ ద్వారా నిర్ధారిత యూఎస్‌బీ సి కేబుల్ కే వర్తిస్తుంది. వాల్యూమ్, మ్యూట్ బటన్ ఫిజికల్‌గా కాకుండా హ్యాప్టిక్‌గా కూడా ఉంటాయి. ఇందులో రెండు హ్యాప్టిక్ ఇంజన్ సిమ్యులేటింగ్ బటన్ ప్రెస్ ఉంటాయి.

మ్యూట్ టాంగిల్ ఇప్పుడు స్లైడింగ్ స్విచ్ ఉండదు. హ్యాప్టిక్ బటన్ ఉంటుంది. బ్యాక్ గ్లాస్‌లానే స్క్రీన్ గ్లాస్ నాలుగువైపులా కేవలం 1.55 మిమీ బేజెల్ ఉంటుంది. ఈ ఫోన్ హీరో డీప్ రెడ్ కలర్, ఫోన్ వైట్, బ్లాక్ , గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉండవచ్చు.

Also Read: PPF Interest Rates: పీపీఎఫ్‌ ఖాతాదారులకు ముఖ్య గమనిక.. వడ్డీరేట్లను ప్రకటించిన ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News