Amazon-Flipkart Sales 2024: ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు, 10 వేల బడ్జెట్‌లో టాప్ 5 ఫోన్లు

Amazon-Flipkart Sales 2024: ప్రముఖ ఈ కామర్స్ వేదికలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రత్యేక సమ్మర్ సేల్స్ నడుస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఏసీలు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌వాచీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే మాత్రం ఇదే మంచి అవకాశం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 6, 2024, 02:48 PM IST
Amazon-Flipkart Sales 2024: ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు, 10 వేల బడ్జెట్‌లో టాప్ 5 ఫోన్లు

Amazon-Flipkart Sales 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 లో ఊహించని ధమాకా ఆఫర్లు ఉన్నాయి. బ్రాండెడ్ 5జి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే అద్భుతమైన ఫీచర్లతో కేవలం 10 వేలలోపే ఫోన్లు లభిస్తున్నాయి. మే 9 వరకూ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఉంటే, మే 7 వరకూ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కొనసాగనుంది. 10 వేల బడ్జెట్‌లో లభించే టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఏమున్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్ కేవలం 8,990 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ అయితే 6జీబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో ఉంటుంది. అంతేకాకుండా Exynos 1330 ఆక్టాకోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇక కెమేరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్,  13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటాయి. ఇక బ్యాటరీ అయితే ఏకంగా 6000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో పనిచేస్తుంది. 

Motorola G34 5G స్మార్ట్‌ఫోన్ ధర 11 వేలు అయితే వివిధ బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే 10 వేలకే పొందవచ్చు. ఈ ఫోన్ కెమేరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ ప్రైమరీ, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 5జి ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 

Samsung Galaxy M14 5G స్మార్ట్‌ఫోన్ 47 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 9,999 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమేరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. 

Redmi 13C 5G ఫోన్ అసలు ధర 13,499 రూపాయలు కాగా 25 శాతం డిస్కౌంట్ అనంతరం కేవలం 10,499 రూపాయలకు లభించనుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 6.74 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 450 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో జి85 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇది కూడా ట్రిపుల్ కెమేరా సెటప్‌తో ఉంటుంది. ఇందులో సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2మెగాపిక్సెల్ మ్యాక్లోలెన్స్ ఉన్నాయి.

Poco M6 Pro 5G ఫోన్ అమెజాన్‌లో కేవలం 9,499 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. 90 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటాయి. 

Also read: Best Compact SUV: ఈ 5 కాంపాక్ట్ SUV కార్లలో ఏది బెస్ట్, ఎంత మైలేజ్ ఇస్తుంది

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News