Aiwa 65 Inch Qled Tv Price: దీపావళి ప్రత్యేక ఆఫర్స్‌..Aiwa 65 Inch Qled స్మార్ట్ టీవీపై 42 శాతం తగ్గింపు!

Aiwa 65 Inch Qled Tv Price: పెద్ద డిస్ప్లే కలిగిన స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లోని Aiwa 65 అంగుళాల QLED Google TV స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ టీవీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2023, 12:38 PM IST
Aiwa 65 Inch Qled Tv Price: దీపావళి ప్రత్యేక ఆఫర్స్‌..Aiwa 65 Inch Qled స్మార్ట్ టీవీపై 42 శాతం తగ్గింపు!

Aiwa 65 Inch Qled Tv Price: థియేటర్‌ పిక్చర్‌ అనుభూతిని పొందడానికి పెద్ద డిస్ల్పే కలిగి స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ టెక్‌ కంపెనీ ఐవా ఇటీవలే విడుదల చేసిన QLED TV స్మార్ట్‌ టీవీ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్‌ టీవీని కంపెనీ ఇటీవలే 65-అంగుళాల QLED Google TV వేరియంట్‌తో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ సరికొత్త డిజైన్‌తో పాటు క్రిస్టల్ టెక్ విజన్, యాంఫీథియేటర్ వంటి చాలా రకాల ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ టీవీపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో..దీనికి సంబంధించిన మరిన్ని ఫీచర్స్‌ ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ టీవీ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ టీవీ ధర MRP రూ. 1,39,990 కాగా దీపావళి ప్రత్యేక సేల్‌లో భాగంగా 42 శాతం తగ్గింపుతో కేవలం రూ. 79,990కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌  కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్స్‌ తెలుసుకోవడానికి అధికారిక ఫ్లిఫ్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Aiwa 65 అంగుళాల QLED Google TV ఫీచర్స్‌:
ఈ స్మార్ట్‌ టీవీ 65 అంగుళాల స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంది. ఇది Google TV OS ఆధారిత Android 11 రన్‌ అవుతుంది. కంటెంట్ కాస్టింగ్, స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడానికి వాయిస్ కమాండ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. పిల్లల కోసం ప్రత్యేకమైన స్మార్ట్‌ మోడ్‌లను కూడా అందిస్తోంది. దీంతో పాటు స్లీపింగ్‌ మోడ్‌ ప్రత్యేకమైన ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డిస్ల్పే రిజల్యూషన్ 3840×2160 పిక్సెల్స్‌ను కలిగి ఉంటుంది. 

మంచి వీడియో, ఆడియో క్వాలిటీ కోసం డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌ను కూడా అందిస్తోంది. టీవీలో 10 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌తో రెండు బాక్స్ స్పీకర్లను కలిగి ఉంటుంది.  ఈ స్మార్ట్ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, ఇతర యాప్‌ల సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు Chromecast, HDR10 సపోర్ట్‌, MEMC, బ్లూటూత్ సపోర్ట్‌, మూడు HDMI 2.0 పోర్ట్‌లు, Wi-Fi డైరెక్ట్, రెండు USB పోర్ట్‌లు, ఈథర్‌నెట్, ఆప్టికల్ అవుట్‌తో స్క్రీన్ షేరింగ్ వంటి అనేక రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News