HBD Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..

HBD Balakrishna: నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అన్న నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు తెలుగులో తొలి నట వారసుడిగా స్టార్ గా సత్తా చూపెట్టిన తొలి హీరోగా రికార్డులకు ఎక్కాడు. అంతేకాదు ఓ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి 50 యేళ్లుగా స్టార్ హీరోగా సత్తా చూపెడుతున్న తొట్ట తొలి భారతీయ హీరోగా రికార్డుల ఎక్కాడు. ఈయన కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..

1 /11

బాలయ్య టాప్ టెన్ చిత్రాలు.. బాలయ్య కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ చిత్రాలున్నాయి. అందులో టాప్ టెన్ చిత్రాల విషయానికొస్తే..

2 /11

అఖండ.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ బాలయ్య కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

3 /11

లెజెండ్.. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వచ్చిన రెండో చిత్రం ‘లెజెండ్’. ఈ సినిమా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

4 /11

సింహా.. బాలయ్య పనైపోయిందన్న సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహా’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సింహ గర్జన చేసాడు.

5 /11

నరసింహనాయుడు బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘నరసింహనాయుడు’. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే కాదు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  

6 /11

సమరసింహా రెడ్డి నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సమరసింహారెడ్డి’. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ చిత్రాల్లో ఇదో ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది.

7 /11

భైరవ ద్వీపం (Bhairava Dweepam) జానపదాలు కనుమరుగు అవుతున్న  సందర్బంలో బాలయ్య రాకుమారుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘భైరవ ద్వీపం’. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో ఢిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. 

8 /11

రౌడీ ఇన్ స్పెక్టర్ బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన  చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. తెలుగులో పోలీస్ బ్యాక్ డ్రాప్  చిత్రాల్లో ఈ సినిమాకు తప్పక స్థానం ఉంటుంది.

9 /11

ఆదిత్య 369 సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలుగా, కృష్ణకుమార్ గా రెండు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆదిత్య 369’. అంతేకాదు తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ మూవీగా ఈ సినిమా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రం పలు రికార్డులను బద్దలు కొట్టింది.

10 /11

ముద్దుల మావయ్య కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో నిర్మించిన చిత్రం ‘ముద్దుల మావయ్య’. తెలుగులో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

11 /11

మంగమ్మ గారి మనవడు భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ తో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’. ఈ  సినిమాతో బాలయ్య తొలి సోలో హిట్ గా నిలిచింది. అంతేకాదు తొలి బ్లాక్ బస్టర్, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.