Kadiyam Kavya Withdraw Form Lok Sahba Poll: తీవ్ర పోటీ ఉన్నా కూడా ఇతరులను కాదని లోక్సభ టికెట్ ఇస్తే కడియం కావ్య నిరాకరించింది. మొదట పోటీకి సై చెప్పి వారం రోజులకు ఊహించని విధంగా ఎన్నికల నుంచి వైదొలగింది. ఈ పరిణామం కలకలం రేపింది.
BRS Party MP Candidates: పార్లమెంట్ ఎన్నికల వేళ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టికెట్లు ఆశిస్తున్న వారిని కాకుండా వేరేవారికి ఇచ్చి కలకలం రేపింది. సొంత కూతురు కవితకే కేసీఆర్ షాక్ ఇచ్చారు.
Warangal: యువతి తన లవర్ కు బుర్ఖావేసింది. దీన్ని అక్కడున్న కొందరు యువకులు గమనించారు. మెల్లగా వీరిని ఫాలో అయ్యారు. లేడీస్ హస్టల్ ముందు ఈ డ్రామాను బైటపెట్టారు. దీంతో బుర్ఖాధరించిన యువకుడు వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సీటిలో చోటు చేసుకుంది.
Thieves Enjoy With Foreign Liqour: ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లగా ఖరీదైన విదేశీ మద్యం కనిపించింది. అవి కనిపించగానే నోరూరింది. వెంటనే ఆ దొంగలు సీసా తెరచి ఫ్రిజ్లోని డ్రైఫ్రూట్స్ తినేసి మంచిగా చిల్ అయ్యారు. అనంతరం నిద్రపోయారు. తెల్లారేసరికి వారు...?
ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యేందుకు ముప్పతిప్పలు పడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిపై అనేక చోట్లా భూకబ్జాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జనగాంలో ముత్తిరెడ్డిపై వ్యతిరేకత ఉందన్న ప్రచారానికి తోడు తాజాగా అభ్యర్థుల జాబితాలోనూ ముత్తిరెడ్డి పేరు లేకపోవడం జనగంలో బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్కి తావిచ్చింది.
Road Accident In Warangal: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. లారీ డ్రైవర్ మద్యం మత్తులో నడపడం వల్లే ప్రమాదనికి కారణని అనుమానిస్తున్నారు.
VRA Suicide Attempt: తమ తాతలు, తండ్రుల కాలం నుండి ఇదే ఉద్యోగాన్ని చేసుకుంటూ బతుకీడుస్తున్నామని.. కొత్తగా తమని కాదని తన తండ్రి హుస్సేన్ ఉద్యోగాన్ని అధికారులు అర్హత లేని మరో వ్యక్తికి అమ్ముకున్నారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. డిప్యూటీ తహశీల్ధార్ తరంగిణి అవతలి వ్యక్తి వద్ద లంచం తీసుకుని తమకు అన్యాయం చేస్తోందని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
Baby Girl Exchanged With Baby Boy: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లలను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేసి ఒకరికి పుట్టిన బాబును తీసుకెళ్లి మరొక తల్లికి అప్పగించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనకు బాధ్యులైన మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఎస్.ఎన్.సి.యు సిబ్బంది నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో భారీ వర్షాలు తగ్గిపోయినా.. ఇంకా చాలా ప్రాంతాల్లో వరదల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో భారీగా వరదలు సంభవించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. వరద నష్టంపై అంచనా వేయడానికి కేంద్ర బృందం రేపు తెలంగాణకు రానుంది.
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద నీరు చేరుతోంది. కాజీపేట రైల్వే స్టేషన్లో వరద నీటితో నిండిపోయింది. దీంతో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.
Heavy Rains in Warangal: రానున్న రెండురోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ ప్రజలకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతోంది అని చెబుతూ ప్రజలు పోలీసు వారి సూచనలు, సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.
ఈ మధ్య చిన్న పిల్లలు కూడా మద్యం సేవించటం ప్రారంభించారు. 9 వ తరగతి చదువుకున్న కొంత మంది పిల్లలు మద్యం తాగి, క్లాస్ లోకి వెళ్ళటమే కాకుండా ఉపాధ్యాయుడిపై మద్యం తాగాడని ఫిర్యాదు ఇచ్చిన ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.
కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి.. కన్న కూతురిని చంపేసిన ఘటన వరంగల్ జిల్లా జనగామలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి తన సొంత కూతురే అడ్డుగా ఉందని కూతురుని హాతమార్చిన ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాలు
KTR comments on PM narendra modi speech in warangal meeting: ప్రధానమంత్రి మోడీ పర్యటన మెత్తం ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొని తన ప్రసంగం మొత్తం అసత్యాలతో కొనసాగిందన్నారు.
Bandi Sanjay About PM Modi Meeting : హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో రేపు జరగబోయే మోదీ సభను సైతం కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ బీజేపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అందుకోసం ఒక్కో కార్యకర్త కనీసం 50 మందిని సభకు తీసుకురావాలి. అదే విధంగా ఒక్కో డివిజన్ నుండి 2 వేల మందిని సభకు హాజరయ్యేలా చూడాలి. మోదీ..మోదీ... బీజేపీ నినాదాలతో ఓరుగల్లు మొత్తం మారుమోగాలి అని వరంగల్ ప్రజానికానీకి పిలుపునిచ్చారు.
PM Modi's Warangal Meeting: వరంగల్ గడ్డమీద 30 సంవత్సరాల తరువాత దేశప్రధాని అడుగు పెట్టబోతున్నారు అని బీజేపి నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీని అక్కున చేర్చుకొని అండగా నిలిచిన జిల్లా అని చెబుతూ.. దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్న రోజుల్లోనే హన్మకొండ నుండి ఎంపీని ఎన్నుకున్నారని వరంగల్ ప్రజానికానికి ఈటల రాజేందర్ గుర్తుచేశారు.
PMO Invites CM KCR: బీజేపి, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడం నిత్యకృత్యమైన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ కీలక నేతలు కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కంటే బీజేపీని ఎన్నుకోవాలని నరేంద్ర మోదీ ప్రజలను ఎలా కోరారో ఇటీవల చూశాం.
Outer Ring Rail Project in Telangana: ఈనెల 8వ తేదీన వరంగల్ కు రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో బీజేపి నేతలు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.