US Elections 2024: అమెరికా అధ్యక్షుడెవరో నిర్ణయించేది ఎవరు, ఆ 3 శాతం ఓటర్ల కీలకమా, భారతీయులెటు

US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో రెండ్రోజల్లో జరగనున్నాయి. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలివి. డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. అసలు అమెరికా అధ్యక్షుడెవరో తేల్చేది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2024, 03:01 PM IST
US Elections 2024: అమెరికా అధ్యక్షుడెవరో నిర్ణయించేది ఎవరు, ఆ 3 శాతం ఓటర్ల కీలకమా, భారతీయులెటు

US Elections 2024: నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి బరిలో నిలిస్తే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధినిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీలో ఉన్నారు. తాజా ట్రెండ్స్ ఓసారి పరిశీలిస్తే డోనాల్డ్ ట్రంప్ పుంజుకున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణమెవరు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని నిర్దేశించేది ఎవరో చూద్దాం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సాధారణంగా ఎప్పుడూ బ్లూ స్టేట్స్, రెడ్ స్టేట్స్ అనేవి రిపబ్లికన్ వర్సెస్ డెమోక్రటిక్ పార్టీల మధ్య విడిపోతుంటాయి. ఈ క్రమంలో స్వింగ్ స్టేట్స్ కీలకపాత్ర పోషిస్తుంటాయి. స్వింగ్ స్టేట్స్‌లోని ఓటర్లు తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా భావిస్తుంటారు. గతంలో అంటే 2020లో జరిగినట్టే స్వింగ్ స్టేట్స్ ఓటర్లే అమెరికా 47వ అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయించనున్నారు. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్ 7 ఉన్నాయి. ఇందులో ఆరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా రాష్ట్రాలున్నాయి. 2020 ఎన్నికల్లో ఈ 7 స్వింగ్ స్టేట్స్‌లో నార్త్ కరోలినా ఒక్కటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనార్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిస్తే మిగిలిన ఆరు రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ది జో బిడెన్‌కు సపోర్ట్ చేశాయి. 

ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎటు, ఆ 3 శాతమే కీలకం

గాలప్ పోల్ ప్రకారం యూఎస్ ఓటర్లలో 43 శాతం స్వతంత్ర ఓటర్లుగా గుర్తించారు. ఈ సర్వే ప్రకారం రిపబ్లికన్లు 27 శాతం ఉంటే డెమోక్రట్లు 27 శాతమున్నారు. ఇక స్వతంత్రులుగా చెప్పుకుంటున్న 43 శాతం ఓటర్లలో మెజార్టీ ఎవరికి మద్దతిస్తే వారితే విజయం. ఈ 43 శాతం మంది అత్యధికులు స్వింగ్ స్టేట్స్ నుంచే ఉన్నారు. ఇందులో పెన్సిల్వేనియాలో 19 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. ఈ రాష్ట్రంలోని 9 మిలియన్ల మంది ఓటర్లలో 1.4 మిలియన్ల మంది ఇండిపెండెంట్ ఓటర్లున్నారు. అయితే సాధారణంగా ఎన్నికల సమయానికి ఈ 43 శాతం ఇండిపెండెంట్ ఓటర్లతో చాలామంది డెమోక్రటిక్ వర్సెస్ రిపబ్లికన్ పార్టీల మధ్య చీలిపోతుంటారు. ఏప్రిల్ నెలలో ఫ్యూ రీసెర్చ్ సెంటర్ పోల్ ప్రకారం49 శాతం డెమోక్రాట్లు, 48 శాతం రిపబ్లికన్లకు తేలింది. ఇక 3 శాతం మంది రియల్ ఇండిపెండెంట్ ఓటర్లుగా ఉన్నారు. 

ఈ 3 శాతం మంది స్వింగ్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ఓటర్లు కావడం విశేషం. ఈ 3 శాతం ఓటర్లతో పాటు అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించేది పోలింగ్ శాతం కూడా. మహిళలు, మెనారిటీ వర్గాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హ్యారిస్ అభ్యర్ధిత్వంపై మొగ్గు కన్పిస్తోంది. ఇక కన్జర్వేటివ్ అమెరికన్లంతా డోనాల్డ్ ట్రంప్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఓటింగ్ శాతం కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది.

Also read: US Elections 2024: ఈసారి స్వింగ్ స్టేట్స్ ఎవరివైపు, బ్లూ వర్సెస్ రెడ్ స్టేట్స్ ట్రెండ్ మారుతోందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News