Donald Trump finally concedes defeat | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించారు. క్రమబద్ధంగా అధికార బదిలీకి అంగీకరిస్తున్నట్లు ట్రంప్ గురువారం వెల్లడించారు. క్యాపిటల్ హిల్‌లో జరిగిన హింస అనంతరం యూఎస్ కాంగ్రెస్ (US Congress) నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాటిక్ నేత బైడెన్ (Joe Biden) విజయం సాధించారని వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే ట్రంప్ అధికార బదిలీకి అంగీకరిస్తున్నట్లు ప్రకటనను విడుదల చేశారు. ఈ మేరకు ట్రంప్ తన ప్రతినిధి ట్విట్టర్ అకౌంట్‌లో ట్విట్ చేశారు.
అయితే ట్రంప్ (Donald Trump) ఎప్పటిలాగానే ఈ ఎన్నికల్లో మోసం జరిగినట్లు ఆక్రోశం వెళ్లగక్కారు. ఎన్నికల ఫలితాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని దీనిపై పోరాటం చేస్తానని వెల్లడించారు. కానీ జనవరి 20న అధికార బదిలీ మాత్రం జరుగుతుందని ట్రంప్ వెల్లడించారు. క్యాపిటల్ హిల్‌పై దాడి (US Capitol violence) ఘటనలో భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్లను రద్దు చేశారు. Also Read: US Congress: జో బైడెనే అధ్యక్షుడు.. హింస అనంతరం యూస్ కాంగ్రెస్ ప్రకటన
Statement by President Donald J. Trump on the Electoral Certification:
“Even though I totally disagree with the outcome of the election, and the facts bear me out, nevertheless there will be an orderly transition on January 20th. I have always said we would continue our...
— Dan Scavino🇺🇸🦅 (@DanScavino) January 7, 2021
దీంతో జనవరి 20న అమెరికా తదుపరి అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. Also Read: ట్రంప్ ఇల్లు .. ఇంద్రభవనం తక్కువేం కాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook