Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరు పేరు ప్రకటించారంటే..?
CM KCR Speech Highlights: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మరింత దూకుడుపెంచారు. ప్రజా ఆశీర్వాద సభల్లో మాటలవాడిని పెంచారు. ముఖ్యంగా కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం పాలకుర్తి, హలియా, ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు.
TS Election 2023: బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. కరీనగర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ధి చెప్పి.. బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో గెలిచి కరీంనగర్ ప్రజలకు సేవ చేసుకుంటానని అన్నారు.
Congress Vijayabheri Yatra in Kosgi: కొడంగల్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండని కోరారు రేవంత్ రెడ్డి. కొడంగల్‌ను అభివృద్ధి చేసింది తాను అని.. మన బతుకులు మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.
Tula Uma Joins in BRS: వేములవాడ బీజేపీ టికెట్ దక్కపోవడంతో సీనియర్ నాయకురాలు తుల ఉమ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నేడు మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరుకున్నారు. తుల ఉమకు పార్టీలో సమున్నత హోదా కల్పిస్తామని కేటీఆర్ అన్నారు.
PM Modi On SC Categorisation: ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కమిటీ వేస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం జరిగిన మాదిగ విశ్వరూప మహాసభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ యువతి స్తంభం ఎక్కి హల్చల్ చేసింది.
KTR Fires On Revanth Reddy: సన్నకారు రైతులకు మూడు గంటల నాణ్యమైన విద్యుత్ సరిపోతుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ప్రజలు కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 3, 4 గంటల కరెంట్ కూడా రాలేదన్నారు.
Vemulawada BJP Ticket Issue: వేములవాడలో బీజేపీకి భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ కీలక నాయకురాలు తుల ఉమకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తనకు బీజేపీ నాయకులు ఫోన్ చేస్తే.. చెప్పుతో కొడతానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Palvai Sravanthi Resigns Congress Party: మునుగోడు అసెంబ్లీ టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంతో పాల్వాయి స్రవంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ.. రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay Speech at Sircilla BJP Rally: మంత్రి కేటీఆర్ అడ్డా సిరిసిల్లలో ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఎటాక్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా రాణిరుద్రమదేవి నేడు నామినేషన్ వేశారు.
Karimnagar Assembly Constituency: తాను ఎంపీగా కరీంనగర్‌ను ఎంతో అభివృద్ధి చేశానని.. ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామన్నారు. రెండుసార్లు ఓడిపోయానని.. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలన్నారు.
Telangana Assembly Elections: మధిర కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం నామినేషన్ వేశారు. మధిర నుంచి తనకు నాలుగో అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
Minister KTR Fell Down Video: ఆర్మూర్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రచారం రథంపై నామినేషన్‌కు వెళుతుండగా.. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో పైన గ్రిల్ వంగిపోవడంతో నేతలు కిందపడిపోయారు. కేటీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
Etela Rajender Fires on CM KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఈటల రాజేందర్. కేసీఆర్ బాధితులు చాలా మంది ఉన్నారని.. అందులో తాను కూడా ఉన్నానని చెప్పారు. వారందరికీ తాను నాయకత్వం వహిస్తున్నానని అన్నారు.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ పేకాట క్లబ్‌లు వస్తాయని.. ఆ పార్టీ గెలవడం వద్దు.. గబ్బు పేకాట క్లబ్‌లు వద్దన్నారు మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని.. మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు.
Manakondur Assembly Constituency: కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్ఎస్లోకే వెళుతుందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేయాలని చూస్తున్నాయని.. ఆ మూడు పార్టీలను బొంద పెట్టాలని కోరారు.
BRS Praja Ashirvada Sabha: 58 ఏళ్ల దుర్మార్గాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో రాయి ఏంటో.. రత్నం ఏంటో ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కోరారు. మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.
BC Atma Gourava Sabha in LB Stadium: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. తెలంగాణ ప్రజలు బీజేపీపై నమ్మకంతో ఉన్నారని.. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు.
Telangana Elections 2023: వైఎస్సార్టీపీ పార్టీకి నాయకులు రాజీనామా చేయడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కేసీఆర్‌ను గద్దె దించ అవకాశం వచ్చినందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. తనతో కలిసి నడిచిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆలోచన చేయాలని రిక్వెస్ట్ చేశారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. సోమవారం ఎమ్మెల్సీ కవిత వాహనాన్ని నిజామాబాద్‌లో అధికారులు చెక్ చేశారు. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.