Minister KTR: కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. రేవంత్ రెడ్డి ఓటమి ఖాయం: కేటీఆర్ జోస్యం

KTR Fires On Revanth Reddy: సన్నకారు రైతులకు మూడు గంటల నాణ్యమైన విద్యుత్ సరిపోతుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ప్రజలు కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 3, 4 గంటల కరెంట్ కూడా రాలేదన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2023, 06:14 PM IST
Minister KTR: కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. రేవంత్ రెడ్డి ఓటమి ఖాయం: కేటీఆర్ జోస్యం

KTR Fires On Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు మరోసారి తెలంగాణ రైతాంగం పట్ల తన అవగాహన లేమిని ప్రకటించారని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో అమెరికాలో  అజ్ఞానంతో మాట్లాడాడని అనుకున్నామని.. కానీ నిన్న కూడా 24 గంటల విద్యుత్ కాదు.. మూడు గంటలు సరిపోతుందని నిస్సిగ్గుగా చెప్పారని మండిపడ్డారు. తెలంగాణలో అంతా చిన్న, సన్నకారు రైతులే అని.. మూడు గంటల విద్యుత్ అని సిగ్గు లేకుండా చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతన్న ఒక దరికి వస్తున్నాడని.. మళ్లీ కాంగ్రెస్ వైఖరితో పదేళ్ల కిందట పరిస్థితిలోకి నెట్టబడతారని అర్థం అవుతోందన్నారు. రైతులను గతంలో బిచ్చగాళ్లతో పోల్చారని గుర్తుచేశారు. చిన్న, సన్నకారు రైతులకు 10 హెచ్‌పీ మోటార్ పెట్టకుంటే 3 గంటల కరెంట్ చాలు అంటాడని.. అసలు వ్యవసాయానికి ఎన్ని హెచ్‌పీ మోటార్లు వాడాలో తెలియదన్నారు. 

"మీకు కరెంట్ కావాలా .. కాంగ్రెస్ కావాలా..? కాంగ్రెస్ హయాంలో ఉన్న పరిస్థితులు మీకు అనుభవాలను గుర్తుచేసుకోండి. కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా 3, 4 గంటల కరెంట్ వచ్చిందా గుర్తు చేసుకోండి. అర్థరాత్రి కరెంట్ వస్తే జాగారాలు చేసిన రోజులు గుర్తుచేసుకోండి. కాలిపోయిన మోటార్లు, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్ స్టేషన్లు ముందు ధర్నాలు, నిరసనలు చేశాం. చేల గట్ల మీద పాములు, తేలుకుట్టి  జరిగిన మరణ మృదంగాన్ని మరోసారి గుర్తు చేసుకోండి. కాంగ్రెస్ హయాంలో రైతన్నలకు క్రాప్ హాలిడేలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇది కాంగ్రెస్ విధానం. రైతుల కంట కన్నీరు చూడాలన్నట్లు మిత్తీలకు అప్పుల తెచ్చిన పంటలు ఎండిపోవాలన్ని రేవంత్ రెడ్డి మాటలు మరోసారి ఆలోచించండి.

మూడు ఎకరాలకు మూడు గంటల చాలు అని రేవంత్ రెడ్డి బరితెగించి చెబుతున్నారు. తెలంగాణ వచ్చాక మేము ఏం చేశామో మీ కళ్ల ముందు ఉంది. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి, సాగు నీటి ప్రాజెక్టులను కాలంతో పోటీ పడి నిర్మించాం.. బోరుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు 24 గంటల కరెంట్ ప్రాణపదం అని భావించి  ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ రోజు తెలంగాణలో కాలిపోయే మోటార్లు లేవు, కాలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు లేవు. ఎన్ని గంటలు మోటార్లు నడిపిన బిల్లులు లేవు కాలువల మీద ఎన్ని మోటార్లు పెట్టుకున్నా మిమ్మలను అడిగేవారు లేరు. ఉచిత విద్యుత్ కోసం ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం 12 వేల కోట్లు ఖర్చు పెడుతుంది.

ఒక వైపు బీజేపీ మెడపై కత్తి పెట్టి మోటార్లకు మీటర్ల పెట్టకపోతే రుణాలు ఇవ్వమని బ్లాక్ మేల్ చేసినా తలొగ్గలేదు. 30 వేల కోట్లు వదులుకున్నాం.. తప్పా మీటర్లు పెట్టలేదు రైతులకు అన్యాం చేయలేదు. ధాన్యం పండించే దానిలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు నెంబర్ వన్‌కు చేరింది. రాబంధుల కాలం పోయింది పోయింది రైతుబంధు రాజ్యం వచ్చింది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యింది. బీఆర్ఎస్ అంటే పంట కోతలు.. కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు.." అని మంత్రి కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ఉదయించకుండా అస్తమించిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి  రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను 3 గంటల కరెంట్‌పై రైతులు నిలదీయాలని కోరారు. కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్చేది లేదని.. కొడంగల్‌లో రేవంత్ ఓడిపోతున్నాడని జోస్యం చెప్పారు. గెలిస్తే కదా  సంతకాల మాటకు అర్థం ఉండేదన్నారు.

Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 

Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News