Upendra UI Review and Rating: సరికొత్త కాన్సెప్ట్ తో థియేటర్లోకి.. ఉపేంద్ర హిట్ కొట్టారా..?

Upendra Telugu review: ఉపేంద్ర అభిమానులే కాదు.. సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం యు ఐ.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వచ్చి సందడి చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా గురించి అందరూ చర్చిస్తున్నారు.  ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రివ్యూ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 20, 2024, 03:30 PM IST
Upendra UI Review and Rating: సరికొత్త కాన్సెప్ట్ తో థియేటర్లోకి.. ఉపేంద్ర హిట్ కొట్టారా..?

Upendra UI Review and Rating: 

కథ.. ఉపేంద్ర డైరెక్ట్ చేసే సినిమాలలో కథను ఆశించకూడదని మరొకసారి నిరూపణ అయింది . కొంతమంది సమాజాన్ని పట్టించుకోకుండా రియాల్టీగా బతుకుదామని , మరి కొంతమంది సినిమాను బ్యాన్ చేయాలని గొడవలు చేస్తూ ఉంటారు. ఒక సీనియర్ రివ్యూ రైటర్ నాలుగుసార్లు సినిమాని చూసినా రివ్యూ మాత్రం రాయలేకపోతాడు. దీంతో ఉపేంద్రని వెతుక్కుంటూ వెళ్తే ఉపేంద్ర రాసి పడేసిన ఒక స్క్రిప్ట్ ఆయనకు దొరుకుతుంది. అదే మనకు సినిమాగా చూపించారు. సత్య (ఉపేంద్ర) అనే వ్యక్తి మంచితనంతో అందరినీ మార్చాలని జాతి, మత, కుల భేదాలు లేని సమాజం నిర్మించాలని అనుకుంటాడు. మరోవైపు కల్కి (ఉపేంద్ర ద్విపాత్రాభినయం) తన తల్లిని నాశనం చేసిన ఈ సమాజంపై కక్ష కట్టి మనుషులందరినీ బానిసలుగా చేయాలని చూస్తూ ఉంటాడు. ఓ ఘటనలో సత్య ను  బంధించి కల్కి బయట సమాజాన్ని తన చేతుల్లోకి తీసుకుందామని ప్రయత్నించే సమయంలో కల్కి సమాజాన్ని ఎలా మార్చాడు. సత్య తప్పించుకొని బయటకు వచ్చాడా? మరి బయట సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు? ఉపేంద్ర రియల్ గా తీసిన సినిమా ఏంటి? మురళీ శర్మ రివ్యూ రాసాడా? అనే విషయాలు తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు.. సాంకేతిక అంశాలు..

ఇందులో ఉపేంద్ర నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సెటైరికల్ సినిమాలలో ఆయన అదరగొట్టేశాడు. యుఐ సినిమాలో ఏకంగా రెండు పాత్రలతో పాటు రియల్ ఉపేంద్రగా కూడా తన నటనతో మెప్పించారు. సత్యను లవ్ చేసే పాత్రలో రీష్మ మెప్పించింది. రవిశంకర్ కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఇక మురళీ శర్మ కాసేపు కనిపించగా మిగతా నటీనటులు ఎవరికి వారు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. ఇక సినిమా ఆటోగ్రఫీ విజువల్స్ కొత్తగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది. పాటలన్నీ ట్రోల్  పై లాగే ప్రయత్నం చేశారు .ఉపేంద్ర కాస్టూమ్స్ కూడా కొత్తగా చూపించారు. కథకు తగ్గట్టుగా లొకేషన్స్ ని కూడా సెట్ చేశారు..

విశ్లేషణ..

ఒకప్పుడు దర్శకుడిగా.. ఏ, ష్..., సూపర్ ఉపేంద్ర ఉప్పి టు రక్త కన్నీరు వంటి సినిమాలు తీసి అప్పట్లో ఆడియన్స్ కి పిచ్చెక్కించిన ఉపేంద్ర.. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ యుఐ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఉపేంద్ర. సినిమాలలో చాలావరకు సమాజంలో జరిగే రియాల్టీ సంఘటన చూపిస్తూ.. సొసైటీ మీద సెటైర్డ్స్ వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమయం గడిపే ఇప్పటి జనరేషన్ ను మొదలుపెట్టి ఆడియన్స్ ని, జనాల్ని, మతం, జాతులను, దేశ అంతర్జాతీయ సమస్యలను, రాజకీయ నాయకులను కూడా ట్రోల్ చేసేసాడు. ఒక్కటినీ వదలకుండా అన్నింటికీ కౌంటర్లు వేశాడు. 

తీర్పు..
మొత్తానికి యుఐ సినిమా సమాజంపై,  సమాజంలో జరిగే సంఘటనలపై ఉపేంద్ర తన స్థాయిలో తీసిన సెటైరికల్ మూవీ అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా చాలా బోర్ అయితే  మామూలు ఆడియన్స్ కి కొంచెం కష్టంగా ఉన్నా ఉపేంద్ర అభిమానులకు కొత్తరకం సినిమాలు నచ్చే వాళ్లకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పవచ్చు.

 ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News