MLC Kavitha: తెలంగాణలో జోరుగా తనిఖీలు.. ఎమ్మెల్సీ కవిత వాహనాన్ని ఆపిన పోలీసులు

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. సోమవారం ఎమ్మెల్సీ కవిత వాహనాన్ని నిజామాబాద్‌లో అధికారులు చెక్ చేశారు. వివరాలు ఇలా..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2023, 05:33 PM IST
MLC Kavitha: తెలంగాణలో జోరుగా తనిఖీలు.. ఎమ్మెల్సీ కవిత వాహనాన్ని ఆపిన పోలీసులు

Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంటోంది. నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతోంది. నామినేషన్ల పర్వం ప్రారంభంకావడంతో నాయకులు ముహూర్తాలు చూసుకుని.. నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరోవైపు డబ్బు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాహనాన్ని చెక్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారును చెక్ చేశారు అధికారులు.

అధికారులు వాహనం ఆపగానే.. కారు నుంచి కిందకు దిగిన కవిత.. తనిఖీలకు సహకరించారు. కారు మొత్తం సోదాలు చేయగా.. అందులో ఏమి దొరకలేదు. తనిఖీలకు సహకరించినందుకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. కారు చెకింగ్ అనంతరం ఎమ్మెల్సీ కవిత అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా.. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున నగదు, బంగారం, మద్యాన్ని పట్టుకున్నారు. ఇప్పటివరకు రూ.500 కోట్ల నగదు ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

 

తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 3వ తేదీన విడులైంది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనుంది. నామినేషన్ల పరిశీలన నవంబర్ 13వ తేదీన ఉంటుంది. నామినేషన్ల విత్ డ్రాకు నవంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News