Telangana Assembly Elections 2023: అక్కాచెల్లెళ్లు కొంత ఆలోచన చేయాలని.. కేసీఆర్ వచ్చాక ఏం చేశారు..? కాంగ్రెస్ ఏం చేసిందో గుర్తు చేసుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఆనాడు మంచి నీళ్ల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో కానీ.. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటింటికి నీళ్లు ఇస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాఫీ కొట్టి హర్ ఘర్ కా జల్ అని పథకం పెట్టారని విమర్శించారు. అప్పట్లో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనేవాళ్లు.. కానీ ఇప్పుడు నేను పోత బిడ్డ సర్కార్ దవాఖానకు అంటున్నారని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డికి మద్దతుగా వీఎన్ఆర్ గార్డెన్‌లో మహిళా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ.. "సీఎం కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేశారు. కేసీఆర్ కిట్ ఇచ్చారు. ఆడబిడ్డ అండగా నిలిచారు. ఆడబిడ్డకు మేనమామ లాగా కల్యాణ లక్ష్మీ తెచ్చారు. మొదట రూ.50 వేలు ఇచ్చారు. తరువాత రూ.75 వేలు.. ఇప్పుడు రూ.1,00,116 ఇస్తున్నారు. కడుపు బిడ్డ పడ్డప్పుడు నుంచి బిడ్డ పెళ్లి అయ్యే వరకు మన ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. పిల్లల చదువు కోసం గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. పిల్లల విదేశీ విద్య కోసం విదేశీ విద్య పథకం పెట్టారు.
కేసీఆర్ వచ్చాక హైదరాబాద్‌లో పేకాట క్లబ్‌లు క్లోజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ ఈ పేకాట క్లబ్ వస్తాయి.. అవి వస్తే మళ్లీ మహిళల పుస్తెలు అమ్ముడే. అంటే కాంగ్రెస్ గెలుచుడు వద్దు.. ఈ పేకాట క్లబ్‌ల గబ్బు వద్దు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించారు. మొదట పెన్షన్ 1000 రూపాయలు ఉండే.. తరువాత రెండు వేలు చేశారు.. ఇప్పుడు 5 వేలు చేస్తామంటున్నారు మన ముఖ్యమంత్రి. మాట తప్పని ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం పెట్టిన మహిళల పేరుతోనే పెట్టారు. గృహ లక్ష్మీ, కల్యాణ లక్ష్మీ, ఇప్పుడు సౌభాగ్య లక్ష్మీ పెట్టారు.
ఈ సారి కారు ఓటు వేసి గెలిపించండి.. ప్రతి రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ షాప్‌లలో సన్న బియ్యం ఇస్తామని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. 30 నాడు కారుకు ఓటు గుద్దుర్రి.. తరువాత సన్న బియ్యం పట్టుర్రి. సంవత్సరానికి 1,13,000 రూపాయల పథకాలతోపాటు గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే ఇస్తాం. బీజేపీ వాళ్లు మహిళల గోస పుచ్చుకుంటుంది. చెప్పుడు మాటలు విని బీజేపీ, కాంగ్రెస్ ఓటు వేసుడు అవసరమా..? నమ్మకానికి మారు మన కేసీఆర్.. కర్ణాటకలో ఇవాళ కరెంట్ కటకటలు.. గ్యారెంటీలు లేవు పాడు లేవు.. అలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా..?" అని అన్నారు.
రాజస్థాన్‌లో ఇవాళ మహిళలకు రక్షణ లేదని.. అలాంటి కాంగ్రెస్ పార్టీ మనకు ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు. షీ టీమ్‌లు పెట్టి ఇక్కడ ప్రతి మహిళకు రక్షణ కల్పించారని అన్నారు. కేసీఆర్ బీమా .. ప్రతి ఇంటికి ధీమా అనే పథకం ఇవాళ పెట్టుకున్నామన్నారు. ప్రతి కుటుంబానికి ఈ రూ.5 లక్షల ఆర్ధిక భరోసా ఇస్తుందని చెప్పారు. ఉప్పల్‌లో లక్ష్మా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
Also Read: World Cup 2023 Semifinal Teams: పాక్ వర్సెస్ ఆఫ్ఘన్ వర్సెస్ కివీస్ 4వ సెమీస్ ఎవరిది
Also Read: NBK109: గొడ్డలికి కళ్ళజోడు.. మన బాలయ్య కు మరో బ్లాక్ బస్టర్ షురూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి