Teenmar Mallanna About CM KCR: జీ తెలుగు న్యూస్‌లో బిగ్ డిబేట్ విత్ భరత్ కార్యక్రమంలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న పలు సంచలన విషయాలు వెల్లడించారు. జీ తెలుగు స్టూడియో సాక్షిగా ఒట్టేసి పలు అంశాలజోలికి వెళ్లబోనని ప్రకటించారు.
Teenmar Mallanna about ktr: ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే నివేదికల ప్రకారం ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుస్తారని చెప్పుకొచ్చిన తీన్మార్ మల్లన్న.. ఓడిపోయే వారిలో మంత్రి కేటీఆర్ కూడా ఉంటారని అన్నారు.
Teenmar Mallanna Interview: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తీన్మార్ మల్లన్న ప్రస్తుతం మన జీ తెలుగు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న అంతిమ లక్ష్యం ఏంటి ? ఆయన రాజకీయ పయణమెటువైపు వెళ్తోంది ? ఆయన మనసులో ఏముంది ? తీన్మార్ మల్లన్నతో లైవ్ డిబేట్లో ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు అంతే ఆసక్తికరమైన సమాధానాలు రానున్నాయి.
Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న అంతిమ లక్ష్యం ఏంటి ? ఆయన రాజకీయ పయణమెటువైపు వెళ్తోంది ? ఆయన మనసులో ఏముంది ? ఇప్పుడు చాలా మంది మెదళ్లను తొలిచేస్తోన్న అంతుచిక్కని ప్రశ్నలివి. ఆయన్నుంచే సమాధానాలు రాబట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్. అదేంటో తెలియాలంటే జీ తెలుగు న్యూస్‌లో మే 12న, గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఎక్స్‌క్లూజీవ్ లైవ్ షో... బిగ్ డిబేట్ విత్ భరత్ వీక్షించాల్సిందే.
Telangana New Secretariat Building: ఇటీవల సీఎం కేసీఆర్ కూడా సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులు, మంత్రి వేములకు పలు సూచనలు చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు, సూచనలు నిర్మాణంలో పాటిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Teenmar Mallanna Political Plans: తీన్మార్ మల్లన్న తీరు మారిందా ? ప్రభుత్వ యంత్రాంగం అవలంబిస్తున్న విధానాలపైన, మంత్రులు, ఉన్నతాధికారుల వేధింపులపైనా, బాధితుల తరపున సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో గళమెత్తిన తీన్మార్ మల్లన్న ఇటీవల కాలంలో తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు తీవ్ర చర్చనియాంశమవుతున్నాయి.
Bandi Sanjay Pada Yatra: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు బండి సంజయ్. పాదయాత్రలో భాగంగా సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ బండి సంజయ్.
Prashant Kishor: జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలని తహతహలాడుతున్న పీకే.. కాంగ్రెస్ లో చేరడానికి ఈ కండీషన్లు పెద్ద ఇబ్బంది కాకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కోసం మిగితా పార్టీలతో బంధాలు కట్ చేసుకోవడానికి పీకే సిద్ధమయ్యారని చెబుతున్నారు.
D Srinivas: ఎంపీ డి.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గురువారం సోనియా గాంధీతో భేటీ అయిన డీఎస్ సుదీర్ఘంగా ఈ విషయంపై చర్చించగా.. అందుకు అమె సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌పై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవో 317 తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
MP Revanth Reddy: టీఆర్ఎస్ ఎంపీలు హైదారాబాద్‌కు వెళ్లిపోతున్నారని.. కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. రేపటి నుంచి వారంతా పార్లమెంట్ ఉభయ సభలకు హాజరవరని ఆరోపించారు.
Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో సీఎం కూర్చికోసం నాలుగు స్తంబాల ఆట ప్రారంభమైందన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ మళ్లి అధికారంలోకి వచ్చే అకాశం లేదని జోస్యం చెప్పారు.
Rakesh Tikait on KCR: రైతు ఉద్యమంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి స్పష్టంగా లేదని రైతు సంఘాల ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. హైదరాబాద్మహాధర్నాలో పాల్గొన్న టికాయిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Eatala Rajender slams TRS party and CM KCR: హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం కేసీఆర్ అహంకారానికి చెంపపెట్టు లాంటిదని, కేసీఆర్ ఈ ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోకుండా డబ్బు సంచులను, అన్యాయం, అక్రమాలను నమ్ముకున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. చివరికి శ్మశానంలో కూడా నోట్ల కట్టలు పంచిపెట్టారని, అధికార పార్టీ కావడంతో ఇష్టారీతిన అధికార దుర్వినియోగం చేశారని ఈటల మండిపడ్డారు.
TRS Plenary: తెరాస అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ మరోసారి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. హైటెక్స్‌లో జరుగుతున్న ఆ పార్టీ ప్లీనరీలో ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి.. కేసీఆర్ ఎన్నికను ప్రకటించారు.
Hyderabad Traffic diversion for TRS plenary: హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా అక్టోబర్ 25, సోమవారం జరిగే ప్లీనరీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నేపథ్యంలో ఐటీ కారిడార్ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
CM KCR: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెరాస శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై చర్చించారు. నవంబరు 15న వరంగల్‌లో పదిలక్షల మందితో విజయగర్జన సభ నిర్వహించనున్నట్టు తెరాస అధినేత స్పష్టం చేశారు.
Motkupalli Narsimhulu praises CM KCR and Dalita bandhu scheme: హైదరాబాద్: దళిత బంధు పథకంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. ఒక దళిత కుటుంబానికి రూ 10 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ లాంటి మొనగాడు దేశంలోనే లేడని మోత్కుపల్లి నర్సింహులు కితాబిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.