D Srinivas: మళ్లీ కాంగ్రెస్​ గూటికి రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్​?

D Srinivas: ఎంపీ డి.శ్రీనివాస్​ తిరిగి కాంగ్రెస్​లో చేరనున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గురువారం సోనియా గాంధీతో భేటీ అయిన డీఎస్​ సుదీర్ఘంగా ఈ విషయంపై చర్చించగా.. అందుకు అమె సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2021, 01:46 PM IST
  • పార్టీ మారే యోచనలో డి.శ్రీనివాస్​!
  • తిరిగి కాంగ్రెస్​లో చేరే అవకాశం!
  • ఇటీవలే సోనియా గాంధీతో భేటీ
D Srinivas: మళ్లీ కాంగ్రెస్​ గూటికి రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్​?

D Srinivas: టీఆర్​ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్​ మరోసారి పార్టీ మారే యోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తిరిగి కాంగ్రెస్​ గూటికి చేరనున్నట్లు (D Srinivas return to Congress) తెలుస్తోంది. ఇటీవలి పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తున్నాయి.

సోనియా గాంధీతో భేటీ..

సోనియా గాంధీతో డి. శ్రీనివాస్​ గురువారం (D Srinivas meet with Sonia Gandhi) సమావేశమయ్యాయారు. సోనియా నివాసంలో 40 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా తాన జీవితం కాంగ్రెస్​లోనే ముగియాలని నిర్ణయించుకున్నట్లు, తనకు పదవులపై వ్యామోహం లేదని కూడా సోనియాతో డి.శ్రీనివాస్ స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన..​ తిరిగి పార్టీలో చేరేందుకు సోనియా అంగీకరించినట్లు సమాచారం.

అయితే పార్టీలో చేరిక ఎఫ్పుడు అనే విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్​ సహా ఇతర కీలక నేతలతో చర్చించిన తర్వాత.. డి.శ్రీనివాస్​ పార్టీలో ఎప్పుడు చేరుతారేనే విషయంపై క్లారిటీ రానుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

పార్టీ మారేందుకు కారణాలివేనా?

డి.శ్రీనివాస్ తొలుత కాంగ్రెస్​లోనే కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో పీసీసీ అధ్యక్షుడిగా. మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. డి. శ్రీనివాస్​ టీఆర్​ఎస్​లో (TRS Party) చేరారు. ఆ తర్వాత 2016లో టీఆర్​ఎస్​ నుంచి రాజ్య సభకు ఎంపికయ్యారు​.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నుంచి డీఎస్​కు టీఆర్​ఎస్ పార్టీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కొంత మంది టీఆర్​ఎస్ నేతలు డీఎస్​కు వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

ఇదిలా ఉండగా.. లోక్ సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్.. బీజేపీ నుంచి కవితపై పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలుపొందటంతో టీఆర్​ఎస్​తో​ డీఎస్​కు సత్సంబంధాలు దెబ్బతిన్నాయని రాజకీయ విశ్లేషకులకు చెబుతుంటారు. టీఆర్​ఎస్​ పార్టీలో తనకు తగిన గౌరవం దక్కలేదని.. డి.శ్రీనివాస్​ తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరో ఆరు నెలల్లో రాజ్య సభ ఎంపీగా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో పార్టీ మారే విషయంపై డీఎస్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also read: Omicron: తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు...8కి చేరిన కేసుల సంఖ్య

Also read: Student suicide note: నా చావుకు మంత్రి KTR కారణం.. ట్విట్టర్‌‌లో తెలంగాణ ఇంటర్ విద్యార్థి సూసైడ్ నోట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News