Revanth Reddy Comments on Alliance with BRS: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తులపై రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మాఫియాతో చేతులు కలపదని.. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బీఆర్ఎస్తో పొత్తు ఉండదన్నారు.
BJP vs BRS Flexi War: నిజామాబాద్ జిల్లాలో బి.ఆర్.ఎస్, బిజెపి పార్టీల మధ్య ప్లెక్సీ వార్ మొదలైంది. శుక్రవారం జిల్లాలో "ఇదిగో మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు" అంటూ పరోక్షంగా స్థానిక ఎంపీ, బీజేపి నేత ధర్మపురి అరవింద్ ని విమర్శిస్తూ పసుపు బోర్డు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
BJP Leaders Comments On Bandu Sanjay: తెలంగాణ ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ముసలం నెలకొంది. అధికార పార్టీని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేయాల్సింది పోయి. సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. భవిష్యత్లో అసంతృప్తి నేతల దారేటు..? వీరి వ్యాఖ్యల వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారా..?
Ponguleti Srinivas Reddy's Delhi Visit: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంలో కొత్తేం ఉంది అని అనుకోకండి. ఎప్పుడూ వ్యాపార పనులపై వెళ్లడం వేరు.. ఈసారి తన రాజకీయ పనులపై వెళ్లడం వేరు అంటున్నాయి పొంగులేటి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయవర్గాలు.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రకటన రాకముందే అసంతృప్త నేతలు పార్టీ జంప్ అవుతున్నారు. త్వరలోనే చేరికలు మరింత జోరు అందుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కీలక నేత వైఎస్ఆర్టీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
Trisha Krishnan Clarity on Joining Congress Party: త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రంగి ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చింది, దీంతో చాలా పుకార్లకు బ్రేకులు వేసినట్టు అయింది. ఆ వివరాలు
తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న అసమ్మతిని బీజేపీ క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లను పార్టీలోకి ఆహ్వానించేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఎన్నికలకు మరింత బలంగా వెళ్లాలని బీజేపీ యోచిస్తోంది.
Political War In Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్లో పదవుల కేటాయింపు చిచ్చు రేపుతోంది. తమకు అన్యాయం జరిగిందంటూ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు భేటీ అయి.. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.
Warangal Police Notice To Ys Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసులు బ్రేక్ వేశారు. పాదయాత్రకు అనుమతి ఎందుకు ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో న్యాయపరంగా వివరణ ఇచ్చేందుకు ఒక రోజు పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.
YS Sharmila Complaint To Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళసైను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర జోరుగా సాగుతోంది. గుండెగాం సమీపంలో వ్యవసాయ కూలీలతో ఆయన మాట్లాడారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Bandi Sanjay Fires On Cm Kcr: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర జోరుగా సాగుతోంది. 3వ రోజు పాదయాత్రలో భాగంగా ముథోల్ నియోజకవర్గంలోని మహాగాం గ్రామం మీదుగా సాగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
Sharmila's padayatra : ఏడాది కాలంగా సాఫీగా సాగిన షర్మిల పాదయాత్రకు ఇప్పుడే అడ్డంకులెందుకు అంటే రకరకాల కారణాలు తెర మీదకు వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Telangana BJP Chief Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు నుంచి అనుమతి వచ్చింది. అయితే కొన్ని కండిషన్లు పెట్టింది. భైంసాలోకి వెళ్లకుండా పాదయాత్ర చేపట్టాలని సూచించింది.
telangana news: తెలంగాణలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి .. బీజేపీ పెద్దలను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Tummala Nageswara Rao Meeting: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు..? ఎందుకు నేడు వందలాది మంది కార్యకర్తలతో పార్టీకి సంబంధం లేకుండా మీటింగ్ నిర్వహిస్తున్నారు..?
Rahul Gandhi On KCR: తెలంగాణ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ.. తిమ్మాపూర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.