Election Commission of India: స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతూ పురపాలకశాఖ జీవో జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.
తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సోమవారంతో తెరపడినట్లయింది. చివరగా ఈనెల 25న పోలింగ్ జరిగిన కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 60 డివిజన్లలో ఇప్పటి వరకూ 34 డివిజన్లలో విజయం సాధించి టీఆర్ఎస్ సత్తా చాటింది.
రాష్ట్ర ఎన్నికల సంఘంపై, మంత్రులపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందంటూ
గత కొన్ని రోజుల నుండి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో నిర్విరామంగా గడిపిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? వ్యక్తి గత సెక్యూరిటీకి కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అయన భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎంపీ సంజయ్ ఫోన్ కూడా స్విచాఫ్ రావడంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు.
తెలంగాణలో పురపాలక ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగించాయి. ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించొద్దని సభలు సమావేశాలకు అనుమతి లేదని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సెల్ఫోన్లు, ఇంటర్నెట్, ఏ ఇతర సాంకేతిక సాధనాల ద్వారా ప్రచారం నిర్వహించొద్దని సూచించింది.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్నీ ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2023అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అటు కేంద్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ పార్టీ అడ్డుకోలేదని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది. పోలింగుకు ఇంకా నాలుగు రోజులే ఉండటంతో అన్నీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాలన్నీ ఉదృతం చేశాయి. ఇందులో భాగంగా శనివారం కామారెడ్డిలో మజ్లీస్ నేత ఎంపీ అసదుద్దిన్ ఓవైసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి అని అయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.