Election Commission of India: తెలంగాణ రాష్ట్ర పురపాలక అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం

Election Commission of India: స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతూ పురపాలకశాఖ జీవో జారీ చేయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 08:43 PM IST
Election Commission of India: తెలంగాణ రాష్ట్ర పురపాలక అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం

Election Commission of India: తెలంగాణ రాష్ట్ర పురపాలక అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.  

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా లోకల్ బాడీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచుతూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడాన్ని భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ను హెచ్చరించింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఆ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డిలకు రికార్డు చేయదగ్గ హెచ్చరికతో పాటు కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు చెందిన 12 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 16న నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యుల గౌరవవేతనాన్ని 30 శాతం పెంచుతూ పురపాలకశాఖ నవంబర్ 18న ఉత్తర్వులు జారీ చేసింది.

మరుసటి రోజే ఆ ఉత్తర్వును ఉపసంహరించుకొంది. ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా ఓటర్లుగా ఉన్న పట్టణ ప్రాంత స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవవేతానాలు పెంచుతూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.  

Also Read: ఓమిక్రాన్ సోకిన వ్యక్తి క్వారంటైన్ నుంచి పరార్.. హోటల్ సిబ్బందిపై కేసు నమోదు! ఇంతకు ఏడున్నాడో తెలుసా?

Also Read: Girls Molested in UP: ఆహారంలో మత్తు మందు కలిపి 17 మంది బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News