Minister Harish Rao at NIMS: ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిపాలైన డా ప్రీతిని పరామర్శించి ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసేందుకని శుక్రవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. మంత్రి రాక సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Eetala Rajender Speech: ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... కళ్యాణ లక్ష్మి పథకం పేరుతో పుస్తెలతాళ్ళు కట్టడానికి కేసీఆర్ ఇచ్చే డబ్బులు మూడు వేల కోట్లు అయితే.. మళ్లీ అదే పుస్తెలను తెంపి కేసీఆర్ 45 వేల కోట్లు సంపాదిస్తుండు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
TS Inter Exam Papers Valuation Tenders: గతంలో ఇంటర్ ఎగ్జామ్స్ పేపర్స్ మూల్యాంకనంలో గ్లోబరేనా సంస్థ చేసిన తప్పిదాలు వల్లే ఎంతో మంది విద్యార్థులకు మార్కులు తప్పులతడకగా పడినట్టు భారీ ఎత్తున ఆరోపణలు రావడం గుర్తుండే ఉంటుంది. ఇంటర్ పరీక్షల్లో తమకు వచ్చిన మార్కులు చూసి ధైర్యం కోల్పోయిన కొంతమంది విద్యార్థిని, విద్యార్థులు అప్పట్లో సూసైడ్స్ చేసుకోవడం పెను వివాదానికి దారితీసింది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తూ.. మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Revanth Reddy's Open Letter To CM KCR: కామారెడ్డి మునిసిపాలిటీ మాస్టర్ ప్లాన్ విషయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా కింద కోటి రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Pawan Kalyan's Varahi Controversy: పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహిపై ఏపీ సర్కారు అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. వారాహి వాహనం వివాదంపై మంత్రి పువ్వాడ క్లారిటీ ఇచ్చారు.
MHSRB Jobs Notification 2022: ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలనునే అభ్యర్థులు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ mhsrb.telangana.gov.in లోకి లాగిన్ అవగలరు.
Harish Rao Slams PM Modi: దేశానికి సంక్షేమ పథకాలు అందించి దేశం తెలంగాణ సర్కారు వైపు తిరిగి చూసేలా చేసిందని.. తద్వారా తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
Bandi Sanjay Padayatra: నిర్మల్ జిల్లా ఎస్పీని కలవడానికి వెళుతున్న వాళ్లను కూడా పోలీసులు అడ్డుకుని దారుణంగా కొడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపి కార్యకర్తలను భేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Group 4 recruitment 2022: నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. . 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Podu Sagu Survey: ఖమ్మం జిల్లాలో పోడు సాగు సర్వేకు బ్రేక్ పడనుంది. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోడు సాగు సర్వే చేపట్టబోమని అటవీ శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఇటీవల గిరిజనుల దాడిలో అటవీ శాఖ అధికారి మృతి చెందిన విషయం తెలిసిందే.
Car Racing in Hyderabad: కార్ల రేసింగ్ ట్రయల్స్ కోసం సెక్రటేరియట్ పరిసరాల్లో నడిరోడ్డుపై మద్యాన్ని ఏరులై పారిస్తారా ? కార్ల రేసింగ్ కోసం ఎన్టీఆర్ పార్కును అడ్డంగా చీలుస్తారా ? ఇంతకీ ఈ రేసింగ్ నిర్వహణ ప్రభుత్వానిదా ? లేక ప్రైవేటుదా అని తెలంగాణ బీజేపి చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు.
TRS MLAs Poaching Case: తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ జరిపే విచారణపై బీజేపీకి ఏ మాత్రం నమ్మకం లేదని డికే అరుణ ప్రకటించారు. ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేదే తమ అనుమానం అని సందేహం వ్యక్తంచేశారు.
Bandi Sanjay About Raja Singh: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి బీజేపీనే పోటీ ఇస్తుందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపినే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు మోపిన పీడీ యాక్టును తెలంగాణ హై కోర్టు కొట్టేయడాన్ని గుర్తుచేస్తూ బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
TRS MLAs poaching case: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు ఏజెంట్లు వచ్చి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిపినట్టుగా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.
Mallu Bhatti Vikramarka: నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి సమస్యలను పారదోలే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందో.. టిఆర్ఎస్ ప్రభుత్వం అవే సమస్యలను, ఆత్మగౌరవాన్ని విస్మరించిందని మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.