Telangana Govt Focused On Temples: తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని తిరుమల స్థాయిలో నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రామప్పతోపాటు కీసర ఆలయంపై కూడా దృష్టి సారించారు.
Twist To Telangana Crop Loan Waiver: రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ మెలిక పెట్టింది. రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరిని చేయడంతో రైతులకు భారీ షాక్ తగిలింది. రుణమాఫీపై విడుదల చేసిన మార్గదర్శకాలు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయి.
Ration Card Must To Loan Waive Telangana Govt Issued Guidelines: తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. రూ.2 లక్షల రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసింది. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంది.
T Square At Knowledge City Raidurgam Of Hyderabad: అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో మరో అద్భుత నిర్మాణం కాబోతున్నది. న్యూయార్క్ టైమ్ స్వ్కేర్ లాంటి నిర్మాణం మన నగరంలో సిద్ధం కాబోతున్నది.
Rename Mulugu District As Samakka Sarakka Mulugu District: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన సమక్క సారక్క తల్లుల జాతరకు నిలయంగా ఉన్న ములుగు జిల్లాకు పేరు మార్చనుంది. అడవి తల్లులైన సమ్మక్క, సారలమ్మల పేరును ములుగు జిల్లాకు పెట్టనున్నారు. ఈ మేరకు ప్రజాభిప్రాయం సేకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.
Countdown Started For Revanth Reddy Govt Says KT Rama Rao: ధాన్యం కొనుగోళ్ల విషయంలో మాట మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రకటించారు.
Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 13 వ తేదీన, అదే విధంగా జూన్ 4 ఎన్నికల కౌంటిగ్ జరుగనుంది. ఈ రెండు తేదీలలో కూడా వేతనంతో కూడిన దినాలుగా ప్రకటిస్తు సీఎస్ శాంతికుమారీ ఉత్తర్వులు జారీచేశారు.
Samantha - Naga Chaitanya Divorce: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో చూడచక్కని జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత జంటకు ఏ కళ్లు కట్టాయో తెలియదు కానీ.. చివరకు ఈ జంట మనస్పర్ధలతో విడిపోయారు. వీళ్లిద్దరి విడాకులు తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ జంట విడిపోవడానికి కారణంగా ఇదే నంటూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Revanth Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు బలం చేకూరుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలుపుతాడని, మరో ఏక్నాథ్ షిండే అవుతారని జోష్యం చెప్పారు. దీంతో తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతోంది.
Telangana: రాష్ట్రంలో త్వరలోనే రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు.
VIPs Vehicle Drivers Fitness Test: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మృతి తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది...
Guidelines To Gruha Jyothi Scheme: ఉచిత విద్యుత్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. ఉచిత విద్యుత్ పొందాలనుకునే ప్రజలకు కొన్ని సూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి చేస్తేనే ఈ పథకాన్ని పొందుతారని స్పష్టం చేసింది.
Gaddar Awards - Revanth Reddy: రేవంతన్న ఈ గద్డర్ అవార్డ్స్ ఏంటన్నా ? అని అడుగున్నారు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమావాళ్లకు సింహా అవార్డ్స్ ఇస్తామంటూ చెప్పినా.. ఆ దిశగా ముందడుగు పడలేదు. కానీ రీసెంట్గా తెలంగాణలో ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సినిమా వాళ్లకు గద్దర్ అవార్డ్స్ ఇస్తానంటూ ప్రకటన చేయడమే కాదు.. నా మాటే జీవో అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోంది. ఈ అవార్డు ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Kumari Aunty Bigg Boss: కుమారి ఆంటీని బిగ్‌బాస్ పంపించాలి.. లేదంటే రాజకీయాల్లోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ స్పందనతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.
Kishan Reddy Railway Lands: భూముల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో రైల్వే అభివృద్ధి పనుల కోసం భూములు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపారు. రోడ్ల విస్తరణ, స్టేషన్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని లేఖలో కోరారు.
Cast Census: దేశంలో ఇతర రాష్ట్రాల్లో చేపట్టినట్లు తెలంగాణలోనూ కులగణన చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కుల గణన కోసం ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై చేపట్టిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు ఆయా శాఖలపై అభివృద్ధి, సంక్షేమ పనులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుదీర్ఘంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలపై మానవత్వం చూపింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 231 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారిలో 212 మంది జీవిత ఖైదీలు, 19 మంది జీవితేతర ఖైదీలు ఉన్నారు.
Telagana Radar Station: భారత నావికా దళానికి తెలంగాణ మరో విశిష్ట సేవలు అందించనుంది. నౌకలు, జలాంత్గరాములకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం తెలంగాణలో ఒక రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది. దశాబ్దా కాలంగా కొనసాగుతున్న ఈ స్టేషన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. భూముల కేటాయింపు, నిధుల చెల్లింపు ప్రక్రియకు పీటముడి వీడింది. 2027లో ఈ కేంద్రం అందుబాటులోకి రానుండడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.