Yadadri: నేటి నుంచే యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Yadadri Brahmosthavalu 2023: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు రెడీ అయింది. నేటి నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2023, 09:14 AM IST
Yadadri: నేటి నుంచే యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Yadadri Brahmosthavalu 2023: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇవాల్టి నుంచి మార్చి 3 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు మెుదలవుతాయి. తర్వాత స్వస్తీవాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. మంగళవారం సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహనతో తొలి రోజు క్రతువు ముగుస్తుంది. ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవాలు నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం రూ.1.50కోట్ల నిధులను కేటాయించింది. మెుత్తంగా 11 రోజులపాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. 

శ్రీవారి కల్యాణోత్సవం నాడు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను అధికారులు రద్దు చేశారు. ఇవాళ ఉదయం  10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు.. మార్చి 3 రాత్రి 9 గటంలకు స్వామివారి జరిగే శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత యాదాద్రీశ్వరుడికి నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవే. ఈ ఉత్సవాల నేపథ్యంలో భక్తులు తెల్లవారుజాము నుంచే శ్రీవారి దర్శనానికి బారులు తీరారు. 

Also Read; Mercury transit 2023: బుధాదిత్య రాజయోగం ఎప్పుడు, ఆ మూడు రాశులకు కలలో కూడా ఊహించని ధన సంపద 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News