Pawan Kalyan's Varahi Controversy: పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహి వివాదంపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. వాస్తవానికి వాహనాల రంగులకు కోడ్స్ ఉంటాయని.. ఇండియన్ ఆర్మీ ఉపయోగించే కలర్ కోడ్ 7B8165 కాగా.. జనసేన అధినేత ఎన్నికల ప్రచార వాహనం వారాహి కలర్ కోడ్ :445c44 అని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టంచేశారు. వారాహి వాహనం రంగుపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తేల్చిచెప్పారు.
డిసెంబర్ 9న హైదరాబాద్ టోలిచౌకి ఆర్టీఓ కార్యాలయంలో వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంది. వారాహి వాహనానికి TS13EX 8384 నంబర్ కేటాయించారు. వారాహి వాహనానికి రవాణా శాఖ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వారం రోజుల క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుందని తెలిపారు. వారాహి వాహనంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను పరిశీలించామని.. రవాణా శాఖ షరతులకు లోబడి వాహనం ఉందని మంత్రి పువ్వాడ అజయ్ క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ నుంచి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాపారావు స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, పుకార్లు షికార్లు చేస్తుండటంతో తాజాగా ఏకంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు చెప్పిన పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా వారాహి వాహనానికి అన్నిరకాల అనుమతులు ఉన్నాయంటూ ఏకంగా మంత్రి స్థాయి వ్యక్తి క్లారిటీ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇది కూడా చదవండి : Pawan Kalyan: గుండె భారంగా మారుతోంది.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్.. జనసైనికులకు పిలుపు
ఇది కూడా చదవండి : Janasena: ఎన్నికల్లో పొత్తులపై నాదెండ్ల కీలక వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్ చెప్పినట్లే..!
ఇది కూడా చదవండి : Pawan Kalyan Martial Arts: మిస్టర్ ప్యాకెజీ స్టార్.. ఏంటి ఈ హౌలే వేషాలు.. పవన్‌పై వైసీపీ నేత సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook