Kishan Reddy Letter: కేసీఆర్‌ పట్టించుకోలే మీరైనా సహకరించండి.. సీఎం రేవంత్‌కు కిషన్‌ రెడ్డి లేఖ

Kishan Reddy Railway Lands: భూముల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో రైల్వే అభివృద్ధి పనుల కోసం భూములు కేటాయించాలని కోరుతూ సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ పంపారు. రోడ్ల విస్తరణ, స్టేషన్‌లు, ప్లాట్‌ఫారాల నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని లేఖలో కోరారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 30, 2024, 07:34 PM IST
Kishan Reddy Letter: కేసీఆర్‌ పట్టించుకోలే మీరైనా సహకరించండి.. సీఎం రేవంత్‌కు కిషన్‌ రెడ్డి లేఖ

Railway Lands Issue: హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్‌లపై భారం తగ్గించేందుకు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పలు చోట్ల కొత్త టెర్మినళ్లు, ప్లాట్‌ఫారాల నిర్మాణానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఈ నిర్మాణ పనులకు భూమి సమస్య ఏర్పడడంతో ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న భూముల విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. చర్లపల్లి, సికింద్రాబాద్, మౌలాలీ రైల్వేస్టేషన్లకు అదనపు భూమి కేటాయించాలని లేఖలో కోరారు.

ఈ సందర్భంగా నగరంలో రైల్వే శాఖ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదించారు. రైల్వే శాఖ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ఉమ్మడిగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు సార్లు (15 జూన్, 2022), (7 మార్చి 2023)న లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలపై ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సహాయ సహకారాలను అందించాలని కిషన్‌ రెడ్డి కోరారు.

లేఖలో ప్రధాన అంశాలు
- చర్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో టెర్మినల్ నిర్మాణం, అదనపు ప్లాట్ ఫాం ల నిర్మాణంతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. స్టేషన్‌ వెలుపల ఇరువైపులా  అప్రోచ్ రోడ్డును విస్తరించాలి. పార్కింగ్ తదితర అవసరాల కోసం అదనపు భూమి కేటాయించాలి.
- ఎఫ్‌సీఐ గోడౌన్ రోడ్డు నుంచి కొత్త స్టేషన్ బిల్డింగ్ వైపు 200 అడుగుల వెడల్పుతో రోడ్డును అభివృద్ధి చేయాలి.
- భరత్‌నగర్ వైపు (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పక్కగా) నుంచి చర్లపల్లి స్టేషన్‌కు వచ్చే రహదారిని 30 అడుగుల నుంచి 100 అడుగుల వెడల్పుతో విస్తరించాలి.
- ఈసీ నగర్ నుంచి చర్లపల్లి స్టేషన్‌లోని ఎంఎంటీఎస్‌ ప్లాట్‌ఫామ్‌ను చేరుకునే రోడ్డును కనీసం 100 మీటర్ల వెడల్పుతో 700 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాల్సి ఉంది.
- చర్లపల్లి స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, ఎంఎంటీఎస్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు 2.7 ఎకరాల అదనపు భూమిని పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం కేటాయించాల్సి ఉంది.
- చర్లపల్లి టెర్మినల్‌కు నీటి సరఫరా కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం ప్రకారం రూ.4 కోట్లను రైల్వే శాఖ ఇప్పటికే జమ చేసింది. ఈ నీటి కనెక్షన్‌ను కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలి.
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్‌ను చేరుకోవడానికి ఆల్ఫా హోటల్ నుంచి రేతిఫైల్‌ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాలి.
- మౌలాలీ యార్డ్ స్టేషన్ పరిధిలో స్టేషన్‌కు ఇరువైపులా నివాసితుల మురుగు నీరు రాకుండా డ్రైనేజీ వ్యవస్థను ఇప్పుడున్న 2 మీటర్ల నుండి 4.8 మీటర్లకు విస్తరించాలి.

Also Read: Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు

Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News