Republic Day: ఖైదీలకు తెలంగాణ కానుక.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 231 మంది ఖైదీల విడుదల

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుదీర్ఘంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలపై మానవత్వం చూపింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 231 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారిలో 212 మంది జీవిత ఖైదీలు, 19 మంది జీవితేతర ఖైదీలు ఉన్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 26, 2024, 08:28 PM IST
Republic Day: ఖైదీలకు తెలంగాణ కానుక.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 231 మంది ఖైదీల విడుదల

Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుదీర్ఘంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలపై మానవత్వం చూపింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 231 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారిలో 212 మంది జీవిత ఖైదీలు, 19 మంది జీవితేతర ఖైదీలు ఉన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 161 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఖైదీలకు క్షమాభిక్ష కల్పించడం, శిక్షల నుంచి ఉపశమనం కల్పించే అధికారం ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్‌ 2), గణతంత్ర దినోత్సవం (జనవరి 6) రోజున సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. ఈ మూడు సందర్భంగాల్లో ఖైదీలను విడుదల చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రెండు సార్లు ఖైదీలను విడుదల చేసింది.

పదేళ్ల తెలంగాణలో 2016, 2020లో ఖైదీలను ముందస్తుగా విడుదల చేశారు. రెండు విడతల్లో 400 మందిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించింది. నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో మరోసారి ఖైదీలు విడుదల కానున్నారు. అనారోగ్యం, వయోభారం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు శిక్ష తగ్గించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తాజా నిర్ణయంతో ఖైదీల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: KTR Republic Day: గవర్నర్‌ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌ ఫెవికాల్‌ బంధమంటూ వ్యాఖ్యలు
 

Also Read: Republic Day: విషాదం నింపిన 'గణతంత్ర వేడుకలు'.. జెండా కర్రకు విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు దుర్మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News